రాష్ట్రీయం

గిరిప్రదక్షిణలో భక్తజన సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్నవరం, నవంబర్ 12: తూర్పు గోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలో మంగళవారం కార్తీకపౌర్ణమి పర్వదినం సందర్భంగా గిరిప్రదక్షిణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రత్నగిరి, సత్యగిరిల చుట్టూ వేలాది మంది భక్తులు తరలిరాగా ఘనంగా ప్రదక్షిణ నిర్వహించారు. రత్నగిరిపై వేంచేసియున్న శ్రీసత్యదేవుడు, అనంతలక్ష్మి సత్యవతీదేవి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఉదయం 7 గంటలకు పల్లకిలో ఉంచి, మెట్లమార్గం ద్వారా కొండ దిగువన తొలి పావంచాల వద్ద ఉన్న కనకదుర్గమ్మవారి ఆలయానికి తీసుకువచ్చారు.
ప్రత్యేక పూజల అనంతరం 8 గంటలకు ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణ చంద్రప్రసాద్, దేవస్థానం ఛైర్మన్ ఐవీ రోహిత్‌కుమార్, కార్యనిర్వహణాధికారి వేండ్ర త్రినాథరావు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్ కొబ్బరికాయలు కొట్టి, జెండా ఊపి, గిరిప్రదక్షిణను ప్రారంభించారు. 11 కిలోమీటర్ల మేర సాగి, మధ్యాహ్నం ఒంటి గంటకు పంపాతీరంలో పవర్‌హౌస్ వద్దకు చేరుకుని, దిగువ ఘాట్‌రోడ్డు ద్వారా తొలి పావంచాల వద్దకు చేరుకోవడంతో గిరిప్రదక్షిణ ముగిసింది.