రాష్ట్రీయం

ఏపీ సీఎంను ఎలా పిలవాలి?: పవన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 14: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పేరును జాతీయ మీడియాలో రాసినట్లు, పలికినట్లు జగన్‌రెడ్డి అని పిలిస్తే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నొచ్చుకోవడం హాస్యాస్పదంగా ఉందని, 150 మంది ఎమ్మెల్యేలూ కూర్చుని ఆయన్ను జగన్‌రెడ్డి అని పిలవాలో, జగన్మోహనరెడ్డి అనాలో, లేక జగన్ అని పిలిస్తే సరిపోతుందో తేల్చుకుని ప్రజలకు స్పష్టత ఇవ్వాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. గురువారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ రాజకీయాల్లోకి రావాలంటే ఎవరైనా బలమైన ఆలోచనా ధోరణితోనే వస్తారని, దానిలో భాగంగానే జనసేన పార్టీ పెట్టకముందు చాలా మంది దళిత, బహుజన, కమ్యూనిస్టు ఉద్యమ నాయకులతో మాట్లాడి, చరిత్రను చదివి, అధ్యయనం చేసి జనసేన పార్టీని ఏడు సిద్ధాంతాలతో రూపకల్పన చేశామన్నారు. రాష్ట్రంలో 50 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోయిన తర్వాత రాష్ట్రప్రభుత్వం ఇసుక వారోత్సవాలు నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 50 మంది ఉసురు పోసుకుని వారి కుటుంబాలను రోడ్డున పడేలా చేసి రాష్ట్రంలో సామాన్య మానవులు బతకలేకుండా చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. జగన్మోహనరెడ్డి తన క్రిష్టియానిటీని దాచుకోవాల్సిన అవసరం లేదని, రాష్ట్ర ప్రజలకు స్పష్టం చేస్తే సరిపోతుందన్నారు. దేశంలో మతం మారినప్పటికీ కులాల పేర్లు అలాగే ఉంటున్నాయన్నారు. భారతదేశం గర్వించదగ్గ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ అసలు పేరు దిలీప్ అని, ఆయన ఇస్లాం మతాన్ని స్వీకరించి ప్రపంచ గర్వించదగ్గ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారని గుర్తుచేశారు. అలాంటప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి క్రిష్టియానిటీని పాటిస్తూ దానిని బహిరంగ పరచకుండా దాయడమెందుకని ప్రశ్నించారు. తెలుగుభాష సరస్వతిని అగౌరవపరిచే విధంగా రాష్ట్రప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. బలవంతంగా చిన్నప్పటి నుండే ఆంగ్లభాష బోధనను తీసుకురావడం సరికాదని ఆక్షేపించారు. తెలుగుభాషను అగౌరవపరిస్తే ఎవరైనా మట్టికొట్టుకు పోవడం ఖాయమన్నారు. ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకుని పరిస్థితుల రీత్యా విడిపోయి ఎవరి జీవితం వారు గడుపుతున్నప్పుడు వారి జీవితాల్లోకి వెళ్లి వారి గురించి పదే పదే ప్రస్తావించడం జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. పార్టీ వాణిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, రాష్ట్రప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వ్యవస్థల్లో తప్పులు జరుగుతున్న చోట జనసేన గళం వినిపించి వారికి అండగా నిలవాలన్నారు.