రాష్ట్రీయం

గాయపడ్డ లోకోపైలట్ చంద్రశేఖర్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 16: కాచిగూడ రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎంఎంటీఎస్ లోకో పైలట్ చంద్రశేఖర్ శనివారం మృతి చెందాడు. కొన్ని రోజుల నుంచి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో అతని కుడి కాలును వైద్యులు తొలగించారు. ప్రమాదంలో చంద్రశేఖర్ కాలు తీవ్రంగా దెబ్బతినడంతో తొలగించినట్లు నాంపల్లి కేర్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. రక్త ప్రసరణ తగ్గడంతో ప్రాణాలకు ప్రమాదమని భావించి కాలు తొలగించినట్లు పేర్కొన్నారు. ఆతడికి ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. లోకో పైలట్ చంద్రశేఖర్‌కు గురువారం ఉదయం సర్జరీ చేసి కాలు తొలగించారు. దీంతో చంద్రశేఖర్ గుండెతో పాటు కిడ్నీ సరిగ్గా పనిచేయకపోవడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాచిగూడ రైల్వే స్టేషన్‌లో సోమవారం ఉదయం లింగంపల్లి-్ఫలక్‌నుమా ఎంఎంటీఎస్ ట్రైన్, కర్నూలు-సికింద్రాబాద్ ఇంటర్ సిటీ (హంద్రీ) ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టిన విషయం విదితమే. ఈ ఘటనలో 18 మంది గాయపడగా, ఇంజన్ కేబిన్‌లో నలిగి చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.