రాష్ట్రీయం

టీడీపీ పార్లమెంటరీ పార్టీ కమిటీల ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 16: తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్లమెంటు కమిటీలకు అధ్యక్షులను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ ప్రకటించారు. శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీడీపీ జాతీయ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీనియర్ నాయకులతో చర్చించారు. పార్లమెంట్ నియోజక వర్గాలపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశం వివరాలను ఎల్ రమణ మీడియాకు వివరించారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజక వర్గానికి అధ్యక్షుడుగా ఆర్మూర్‌కు చెందిన యాదగౌడ్‌ను (బీసీ) నియమించారు. పెద్దపల్లి పార్లమెంట్‌కు చెన్నూర్‌కు చెందిన సంజయ్ (ఎస్సీ), మహబూబాబాద్ పార్లమెంట్‌కు మహబూబాబాద్‌కు చెందిన కొండపల్లి రాంచదర్‌రావు(ఓసీ), నల్లగొండ పార్లమెంట్‌కు మిర్యాలగూడకు చెందిన నెల్లూరు దుర్గాప్రసాద్ (ఎసీ), మెదక్ పార్లమెంట్‌కు దుబ్బాకకు చెందిన ఇల్లందు రమేష్ (ఓసీ), జహీరాబాద్‌కు ఎల్లారెడ్డికి చెందిన పైడి గోపాల్‌రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్‌కు ఉప్పల్‌కు చెందిన కందికంటి అశోక్‌కుమార్ గౌడ్ (బీసీ)ను నియమించారు. కరీంనగర్ పార్లమెంట్‌కు చొప్పదండికి చెందిన జోజిరెడ్డి (మైనారిటీ)ని నియమించారు. ఈ నియామకాలు తక్షణ అమలులోకి వస్తాయని పార్టీ ప్రధాన కార్యదర్శి నన్నూరి నర్సిరెడ్డి పేర్కొన్నారు.
*చిత్రం... ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో శనివారం టీడీపీ జాతీయ పార్టీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ సీనియర్ నాయకులతో చర్చలు జరుపుతున్న దృశ్యం