రాష్ట్రీయం

ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి చొరవ చూపాలి: వామపక్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 18: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిష్కారం కోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు చొరవ చూపాలని ఏపీ వామపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు. గత 45 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు ఐక్యంగా సమ్మెబాట పట్టారని, ఆర్టీసీ కార్మికులు పలు రూపాల్లో ఆందోళనల చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందన్నారు. ఇప్పటికే 23 మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, కార్మికులతో చర్చల ద్వారా సమ్మెను పరిష్కరించాలని పలుమార్లు హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి సూచించిందన్నారు. కేసీఆర్ మొండి వైఖరి విడనాడాలని కోరారు. ఆ మేరకు సోమవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు, న్యూడెమోక్రసీ వై సాంబశివరావు, సీపీఐ (ఎంఎల్) గుర్రం విజయకుమార్, ఎంసీపీఐ కాటం నాగభూషణం తదితరులు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.