రాష్ట్రీయం

జనవరి 8న దేశవ్యాప్త సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 19: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వచ్చే ఏడాది జనవరి 8న జరిగే దేశవ్యాప్త సమ్మెను భారత్ బంద్ మాదిరిగా నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నట్టు సీఐటీయూ జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ హేమలత వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మంగళవారం ఆమె విలేఖర్లతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్‌లో ఢిల్లీలో జరిగిన కేంద్ర కార్మిక సంఘాల సమావేశంలో జనవరి 8న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఆ సమ్మెను జయప్రదం చేయడానికి సీఐటీయూ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కార్మికులను ఐక్యంచేసే కార్యాచరణతో ముందుకు సాగుతున్నామన్నారు. ప్రస్తుతం దేశం ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతోందని, అనేక ప్రైవేటు కంపెనీలు సైతం సంక్షోభంలోకి నెట్టబడుతున్నాయన్నారు. ఇప్పటికే లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారని, రానున్న కొద్ది కాలంలో మరో పది లక్షల మంది వరకు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితులు కన్పిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఐటీ, నిర్మాణరంగం, గార్మెంట్స్, టెక్స్‌టైల్స్ వంటి రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు రోడ్డున పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రజల కొనుగోలు శక్తి రోజు రోజుకూ క్షీణిస్తోందన్నారు. ప్రజల కొనుగోలు శక్తి పెంపుదల పేరుతో కార్పొరేట్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం రూ.2.1 లక్షల కోట్ల రాయితీలను ఇచ్చిందని, ఈ రాయితీ సొమ్మును ఉత్పాదక రంగంపై పెట్టినట్టయితే మంచి ఫలితాలు వచ్చేవని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో లక్షలాదిగా ఉపాధి కోల్పోతున్న కార్మికులకు నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉందని హేమలత పేర్కొన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం రక్షణ రంగానికి సంబంధించిన ఉత్పత్తి రంగాన్ని ప్రైవేటు కంపెనీలకు అప్పగించిందన్నారు.