రాష్ట్రీయం

ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: తిరుచానూరులో కొలువైవున్న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి 6 నుంచి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ ఇతర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ ఝాన్సీరాణి, వీఎస్వో ప్రభాకర్, ఏఈఓ సుబ్రమణ్యం, సూపరింటెడెంట్ మధుసూదన్, ఏవీఎస్వో నందీశ్వర్ రావు, ఆర్జితం ఇన్‌స్పెక్టర్ కోలా శ్రీనివాసులు, అర్చకులు ప్రతాప్, మణికంఠ స్వామి తదితరులు పాల్గొన్నారు. కాగా తిరుచానూరు పద్మావతి అమ్మ వారి ఆలయంలో ఈ నెల 23 నుండి ప్రారంభం కానున్న కార్తీక వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే మంగళవారం నాడు నిర్వహించే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (ఆలయ శుద్ధి) శాస్త్రోక్తంగా సాగింది. ఈనెల 23న ఉదయం ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రోజుకో వాహనంపై అమ్మవారు ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు. డిసెంబర్ 1న పంచమీ తీర్థం, ధ్వజ అవరోహణం, 2న పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
*చిత్రం... కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్య క్రమంలో భాగంగా తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయాన్ని శుద్ధి చేస్తున్న సిబ్బంది