రాష్ట్రీయం

సీడ్‌పత్తి ప్యాకెట్ ధర పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, నవంబర్ 20: నడిగడ్డలోని జోగుళాంబ గద్వాల జిల్లాలో 40 వేల ఎకరాల్లో సాగవుతున్న సీడ్ విత్తనోత్పత్తి పంటకు రైతుకు ప్యాకెట్ ధర పెంచాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం నాయకులు వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నారు. సీడ్‌పత్తి రైతుల సమాఖ్య ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ కె.శశాంక, ఇన్‌చార్జి ఎస్పీ కె.అపూర్వరావు సమక్షంలో సీడ్‌రైతులు, ఆర్గనైజర్లు, సీడ్ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపారు. ప్యాకెట్ ధరను పెంచడంతో పాటు దూదిని రైతుల సమక్షంలో తూకాలు వేయాలని, ఏప్రిల్‌లోగా రైతు పండించిన పంటకు ధరలు ఇవ్వాలని, అక్రమ వడ్డీలను వసూళ్లు చేయరాదంటూ పలుడిమాండ్లతో చర్చలు జరుగగా కంపెనీ ప్రతినిధులు, ఆర్గనైజర్లు రెండు వారాల గడువు కోరారు. జిల్లా కలెక్టరేటు సమావేశ మందిరంలో అసంపూర్తిగా చర్చలు జరగడంతో అప్పటికే వందలాది మంది రైతులు కలెక్టరేట్ బయట గుమిగూడారు. ఈ సందర్భంగా రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తూ సీడ్ కంపెనీ, ఆర్గనైజర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా స్థాయి అధికారుల సమక్షంలో రైతులకు మరోసారి మోసం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని రైతు సంఘం నాయకులు వాపోయారు. రైతులపక్షాన ఎంతటి పోరాటాలకైనా సిద్ధమని, న్యాయం జరిగేంత వరకు ఆపేదిలేదని రంజిత్‌కుమార్ స్పష్టం చేశారు. ఒకానొక సందర్భంలో పోలీసులకు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వివాదం, తోపులాటలు జరిగాయి. రైతుసంఘాల నాయకులను అరెస్టు చేసేందుకు పోలీసులు పెద్దఎత్తున మోహరించి బలవంతంగా వ్యాన్లు ఎక్కించే ప్రయత్నం చేయగా కొందరు రైతులు పోలీసుల వాహనాలపై రాళ్లు రువ్వినట్టు తెలిసింది. పెద్దఎత్తున మోహరించిన పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేసి రైతుసంఘాల నేతలను, రైతులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా జిల్లా సీడ్‌పత్తి రైతుల సమాఖ్య కన్వీనర్ రంజిత్‌కుమార్ మాట్లాడుతూ పోలీసుల బలం, బలగంతో రైతులపై దౌర్జనం చేయాలని చూస్తున్నారని, ఇలాంటి చర్యల వల్ల రైతులు తిరగబడే రోజులు దగ్గరకు వస్తాయని హెచ్చరించారు.
*చిత్రం... రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు