రాష్ట్రీయం

ఇతర మతాలకు స్థలం కేటాయించే అధికారం సుప్రీంకు ఎక్కడిది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 21: అయోధ్యలో రామమందిరానికి స్థలం కేటాయిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సబబేనని, అయితే ఇతర మతాల వారికి స్థలం కేటాయించే సుప్రీం అధికారం ఎవ్వరికీ లేదని గోవర్ధన పీఠాధిపతి నిశ్చలానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం నిశ్చలానంద సరస్వతి తిరుమల శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం తాను బస చేసిన హంపీ మఠంలో నిశ్చలానంద సరస్వతి విలేఖరుల సమావేశం ఏర్పాటుచేసి సుప్రీం తీర్పుపైన, పాలకుల నిర్ణయాలపైన తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన మఠాధిపతులను పక్కనపెట్టి ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ లాంటి వారి రామజన్మభూమి కమిటీలో స్థానం కల్పించడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ లౌకికవాదం పేరుతో ప్రభుత్వాలు ధర్మం తప్పుతున్నాయన్నారు. ఆచార్యులు నిర్ధేశించాల్సిన ధర్మాన్ని ప్రభుత్వాలే నిర్ణయిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ఆశాజనకంగా లేదన్నారు. రామమందిరానికి స్థలం కేటాయించడం సబబేనని, ఇతర మతాల వారికి స్థలం కేటాయించడం సుప్రీంకోర్టుకు ఎక్కడదన్నారు.