తెలంగాణ

ఫీజు కట్టేశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 19: ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు మెస్ బకాయిలు 3,061 కోట్ల 69లక్షల రూపాయలను విడుదల చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్‌సి సంక్షేమ శాఖకు 517.35 కోట్లు, గిరిజన సంక్షేమం 288.92 కోట్ల రూపాయలు, బిసి సంక్షేమం 1954.25 కోట్ల రూపాయలు, వికలాంగుల సంక్షేమం 0.68 కోట్ల రూపాయల చొప్పున మొత్తం 3061.69 కోట్లు విడుదల చేశారు. వృత్తి విద్యా కాలేజీల్లో కనీస సౌకర్యాలు లేకపోవడం, అవసరం అయిన బోధనా సిబ్బంది సైతం లేకపోవడంతో కాలేజీల్లో సౌకర్యాలపై తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తనిఖీలను కాలేజీల యాజమాన్యం వ్యతిరేకిస్తోంది. తనిఖీలు, ప్రమాణాల విషయంలో కఠినంగా ఉండాలని భావిస్తున్న ప్రభుత్వం ముందుగా ఫీజుల బకాయిలను చెల్లించాలని నిర్ణయించింది. నాలుగు రోజుల క్రితం జరిగిన సమీక్షలో బకాయిలు విడుదల చేయనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆ మేరకు మంగళవారం నిధులు విడుదల చేశారు.