రాష్ట్రీయం

విద్యుత్ చార్జీల పెంపు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 30: ఆర్టీసీ బస్‌చార్జీలు పెరిగినట్లే త్వరలో విద్యుత్ చార్జీలు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు వేగవంతం చేస్తోంది. తెలంగాణ విద్యుత్ రెగ్యులేటరీ సంస్థ విద్యుత్ చార్జీలను పెంచడానికి కసరత్తు పూర్తిచేసింది. ఏక్షణానైనా పెంచిన విద్యుత్ చార్జీలను అమలు చేయడానికి ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. మున్సిపల్ ఎన్నికలు ముందు ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచడానికి సాహసం చేస్తుందా? అంటూ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 2020-2021 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ చార్జీలను ఏమేరకు పెంచాలన్న అంశంలో ఈఆర్‌సీ అధికారులకు క్లారిటీ ఉందంటున్నారు. వాస్తవానికి శనివారం ఈఆర్‌సీ అధికారులు కొత్త విద్యుత్ చార్జీల పట్టికను విడుదల చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే, ఈఆర్‌సీ చైర్మన్ హైదరాబాద్‌లో లేనందున పెరిగిన విద్యుత్ చార్జీల ప్రకటన వాయిదా పడిందని అధికారులు చెబుతున్నారు. విద్యుత్ చార్జీలు పెంచకపోతే విద్యుత్ సంస్థల డిస్కంలు నష్టాల్లో కూరుకుపోతాయని ట్రాన్స్‌కో, జెన్‌కో అధికారులు గుర్తు చేస్తున్నారు. ఇటీవల విద్యుత్ కార్మికులకు భారీగా వేతనాలను పెంచారు. పెరిగిన వేతనాలతోప్రభుత్వంపై భారీగా అదనపు భారం పడుతుందని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. మరోపక్క విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వం వేలకోట్లు రూపాయలు ఖర్చు చేస్తోంది. రాష్ట్రంలో ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టులకు విద్యుత్ అవసరం ఉంది.