రాష్ట్రీయం

పర్యాటకుల భద్రతే ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, నవంబర్ 30: నాగార్జునసాగర్ సందర్శనకు వచ్చే పర్యటకుల భద్రతే ముఖ్యమని నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఆర్డీఓ జగన్నాధరావు అన్నారు. తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో శనివారం నాడు నాగార్జునసాగర్ నుండి కృష్ణా నదిలో శ్రీశైలానికి ఏర్పాటు చేసిన లాంచీ ప్రయాణాన్ని స్థానిక ఎఫ్‌డీఓ గోపిరవితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీశైలం వెళ్తున్న లాంచీ ప్రయాణికులందరూ లైఫ్ జాకెట్లు విధిగా ధరించాలని ఆయన సూచించారు. పర్యాటకుల భద్రతకు సంబంధించిన అన్ని చర్యలు తీసుకోవాలని టూరిజం అధికారులను ఆదేశించారు. 52 మందితో శనివారం నాడు నాగార్జునసాగర్ నుండి తెలంగాణ టూరిజం లాంచీ బయలుదేరి వెళ్లింది. కార్యక్రమంలో టూరిజం డీజిఎం ఉపేంద్ర, ఫారెస్ట్ రేంజర్ రాజేందర్, డీసీటీఓ శరత్‌చంద్ర, వీఆర్‌ఓ నిరంజన్ పాల్గొన్నారు.