రాష్ట్రీయం

ఆర్టీసీ కార్మికులకు సీఎం వరాల జల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉద్యోగం ఉంటుందా? ఊడుతుందా? తెలియక 55 రోజులుగా టెన్షన్ పడిన ఆర్టీసీ కార్మికులపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. అది ఎంతగా అంటే... వారే ఆశ్చర్యపోయే విధంగా వరాలు ఇవ్వడంతో కార్మికుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయా? అన్నంతగా... ఆదివారం ప్రగతి భవన్‌లో ఆర్టీసీ కార్మికులతో సమావేశమై వారితో కలిసి భోజనం చేశారు. అడక్కుండానే ఏకంగా 26 వరాలను కురిపించేశారు. ఇకపై మహిళా కండక్టర్లు ఖాకీ డ్రస్సు వేసుకోనవసరం లేదన్న హామీతో కార్మికలోకం ఉబ్బితబ్బిబ్బయంది. ఏటా లక్ష రూపాయల బోనస్ వచ్చే విధంగా పనిచేసి సంస్థను లాభాల బాటలో నడిపించాలని పిలుపునిచ్చారు. మరో తీపి వార్త ఏమిటంటే.. వీరి 58 సంవత్సరాల పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరాలకు పొడిగించారు.
*చిత్రం...ఆదివారం ప్రగతి భవన్‌లో ఆర్టీసీ కార్మికులతో ముఖ్యమంత్రి కేసీఆర్ కరచాలనం