రాష్ట్రీయం

భారతీయ సంస్కృతి నిరుపమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గణపురం: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవని జర్మన్ శ్రీ సాయి ప్రాణయోగ నిర్వాహకుడు చెల్లేటి సాయిరెడ్డి అన్నారు. ఆదివారం 40 మంది జర్మనీకి చెందిన యోగా బృందం గణపేశ్వరాలయం కోటగుళ్లను సందర్శించారు. గత నెలరోజులుగా శ్రీ సాయి ప్రాణయోగ బృందం జిల్లాలో పర్యటిస్తున్నారు. మొదట ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని రామప్ప దేవాలయం, రేగొండ మండలంలోని పాండవుల గుట్టలను సందర్శించిన జర్మన్‌లు ఆదివారం చివరి రోజు కోటగుళ్లలో యోగా శిక్షణ నిర్వహించారు. మొదట చొల్లేటి సాయిరెడ్డి బృందం ఆలయాన్ని సందర్శించగా అర్చకుడు నరేష్ వారిని సాదరంగా ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదట యోగా బృందం గణపతి పూజ, గాయత్రి మంత్రాన్ని పటించిన అనంతరం ఆలయ ప్రాంగణంలో రెండు గంటల పాటు యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం యోగా బృందం నిర్వాహకులు సాయి చొల్లేటి ఆలయ విశిష్టతలను జర్మన్‌లకు వివరించారు. ఆలయ నిర్మాణం, రాతికట్టడాలు, శిల్ప సంపద తదితర అంశాలను వారికి జర్మనీ భాషలో అర్ధమయ్యేలా తెలియజేశారు. అనంతరం జర్మన్ బృందం సభ్యులు మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవని, భగవద్గీత అంటే తమకెంతో గౌరవం ఉందన్నారు. కేవలం రాతి కట్టడాలు భారతదేశంలో మాత్రమే కనిపిస్తాయని, అవి కాకతీయులు నిర్మించిన అద్భుత కళాఖండాలన్నారు. ఇక్కడ ప్రతి శిల్పంలోనూ దైవత్వం ఉందన్నారు. ఇక్కడి మహిళల కట్టు, బొట్టు వారి సంస్కృతి, ఇక్కడి ప్రకృతి ఎంతో అద్భుతమన్నారు. శ్రీసాయి ప్రాణ యోగ బృందాలు ప్రతియేడు కోటగుళ్లకు రావడం ఆనవాయితీగా వస్తుందని, గత మూడు సంవత్సరాలుగా ఇక్కడ యోగా నేర్చుకోవడం తమకెంతో ఆనందంగా ఉందన్నారు. ఈ ఆలయంలో అద్భుత శక్తులున్నాయని, ఇక్కడ యోగా చేసినంత సేపు కొత్త అనుభూతిని పొందుతున్నామన్నారు.
కాకతీయుల శిల్ప సంపదను భావితరాలకు అందించాలని వారు ఈ సందర్భంగా అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అనంతరం ఆలయ అర్చకులు నరేష్‌తో పాటు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో యోగా బృందాన్ని శాలువలతో ఘనంగా సన్మానించారు. యోగా అనంతరం జర్మనీ బృందం సభ్యులు ఆలయ శిల్ప సంపదను తమ కెమెరాల్లో బంధించారు. సుమారు మూడు గంటల పాటు జర్మన్ దేశస్తులు కోటగుళ్లలో సందడి చేశారు.
*చిత్రం...ఆలయ ప్రాంగణంలో భజనలు చేస్తున్న జర్మన్ దేశస్తుల బృందం