రాష్ట్రీయం

నేవీలో తొలి మహిళా పైలెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 2: డోర్నీయర్ విమానాలు నడిపే శిక్షణా కార్యక్రమంలో ముగ్గురు అధికారులతో కూడిన ప్రత్యేక బ్యాచ్‌లో ఒక మహిళా పైలెట్ ఉండటం విశేషం. సబ్ లెఫ్టినెంట్ శివంగి ఈ రకమైన శిక్షణ పూర్తి చేసుకుని భారత నౌకాదళంలో తొలి మహిళా పైలెట్‌గా చరిత్ర సృష్టించి రికార్డులకెక్కారు. ఈ సందర్భంగా సోమవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో శివంగిని కమాండింగ్ ఇన్ చీఫ్, వైస్ అడ్మిరల్ ఏకే చావ్లా శిక్షణ పూర్తి చేసిన పైలట్లకు గోల్డెన్ వింగ్స్ పేరిట పురస్కారాన్ని ప్రదానం చేశారు. బీహార్ రాష్ట్రం ముజఫర్‌పూర్ ప్రాంతానికి చెందిన మహిళా పైలెట్ శివంగి షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ఉత్తీర్ణురాలై పైలెట్ ఎంట్రీ స్కీంలో ప్రవేశించారు. ఇజీమాలాలో ఇండియన్ నేవల్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించే 27వ నేవల్ ఓరియంటేషన్ కోర్సులో భాగంగా ఈ శిక్షణ పొందారు. గత ఏడాది జూన్‌లో ఈ శిక్షణలో చేరారామె. ఈమె ఐఎన్‌ఏఎస్ 550, డోర్నియర్ స్క్వాడ్రాన్ ఐఎన్‌ఎస్ గరుడలో సంస్థలో పని చేస్తున్నారు.
*చిత్రం...నేవీలో తొలి మహిళా పైలెట్‌గా శిక్షణ పొందిన సబ్ లెఫ్టినెంట్ శివంగి, సత్కరిస్తున్న వైస్ అడ్మిరల్ చావ్లా