రాష్ట్రీయం

దాడులకు మావోల యాక్షన్ టీంలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, డిసెంబర్ 4: విశాఖ మన్యంలో హింసాకాండను సృష్టించేందుకు మావోయిస్టుల యాక్షన్ టీంలు సంచరిస్తున్నట్లు పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈనెల 2 నుండి 8వ తేదీ వరకు పీఎల్‌జీఏ వారోత్సవాలు మావోయిస్టులు పాటిస్తున్నారు. వారోత్సవాల కాలంలో మావోయిస్టుల హింసాకాండ, గిరిజనులతో సభలు నిర్వహించకుండా పోలీసులు పెట్రోలింగ్ కొనసాగిస్తున్నారు. మావోల యాక్షన్ టీంలను ధీటుగా ఎదుర్కొనేందుకు కౌంటర్‌గా పోలీసు యాక్షన్ టీంలను రంగంలోకి పోలీసు శాఖ దింపింది. మరోపక్క వారోత్సవాల సమయంలో మావోయిస్టుల హిట్ లిస్టులో ఉన్న వారిని హతమార్చేందుకు, దాడులు చేయడానికి యాక్షన్ టీంలను రంగంలోకి దింపినట్లు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందినట్లు పాడేరు డీఎస్పీ రాజ్‌కమల్ బుధవారం విలేఖరుల సమావేశంలో స్పష్టం చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని మావోల హిట్‌లిస్టులో ఉన్న వారంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవడమే కాకుండా గిరిజనులంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.