రాష్ట్రీయం

రైల్వే స్టేషన్లకు సౌర విద్యుత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం: విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని కొన్ని రైల్వే స్టేషన్లకు సోలార్ విద్యుత్ సదుపాయం కల్పించనున్నామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య చెప్పారు. దీనివల్ల నిధుల ఆదాతోపాటు విద్యుత్ అవాంతర సమస్యలు ఉండవన్నారు. బుధవారం ఆయన విశాఖ జిల్లాలోని అనకాపల్లి, తూర్పు గోదావరి జిల్లాలోని తుని, అన్నవరం, సామర్లకోట, కడియం, ద్వారపూడి, రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లలో వార్షిక తనిఖీ చేశారు. స్టేషన్లలోని అన్ని విభాగాలను ఆమూలాగ్రం పరిశీలించారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడారు. ప్రయాణికుల సౌకర్యాలే పరమావధిగా రైల్వే స్టేషన్ల అభివృద్ధికి చర్యలుతీసుకుంటున్నామన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధుల సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకుని సదుపాయాలు మెరుగుపర్చడానికి కృషిచేస్తున్నామన్నారు. విజయవాడ రైల్వే డివిజన్‌లో రైళ్ళలో విధుల్లో వున్న సిబ్బంది కదలికలు తెలుసుకునేలా ఒక ప్రత్యేక యాప్‌ను రూపొందించామని జీఎం గజానన్ మాల్య తెలిపారు. ఈ యాప్ ద్వారా ఎవరెక్కడ ఉన్నారో తెలుసుకుని, మరింత మరింత సమర్ధవంతమైన సేవలు అందించడానికి అవకాశముంటుందన్నారు. రాజమహేంద్రవరం తూర్పు రైల్వే స్టేషన్‌లో 4, 5 ఫ్లాట్‌ఫారాలను నిర్మించడానికి రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపించామన్నారు. అనుమతి, నిధులు వచ్చిన వెంటనే పనులు చేపడతామన్నారు. రాజమహేంద్రవరం వద్ద గోదావరి నదిపై ఆర్చి బ్రిడ్జిపై రెండవ ట్రాక్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. రాజమహేంద్రవరంలోని తూర్పు రైల్వే స్టేషన్ సమీపంలోని బొగ్గు షెడ్‌ను ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు కడియం లేదా ద్వారపూడి తరలించాలని యోచిస్తున్నామన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాజమహేంద్రవరం సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి భవాని తమ తమ నియోజకవర్గాల పరిధిలోని రైల్వే స్టేషన్లలో సదుపాయాలను మెరుగు పర్చాలని కోరుతూ వినతి పత్రాలు అందించారు. జి ఎం గజానన్ మాల్య వెంట విజయవాడ డీఆర్‌ఎం శ్రీనివాస్ తదితరులున్నారు.

*చిత్రం... రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేస్తున్న ద.మ. రైల్వే జీఎం గజానన్ మాల్య