రాష్ట్రీయం

గాలి నుంచి నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దేశంలో మొట్టమొదటిసారిగా సికిందరాబాద్ రైల్వే స్టేషన్‌లో ‘గాలి నుంచి నీరు ఉత్పత్తి’ ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఎలాంటి కాలుష్యం లేకుండా స్వచ్ఛమైన
మంచినీటిని రైల్వే ప్రయాణికులకు గురువారం నుంచి అందుబాటులోకి తీసుకువచ్చారు. గాలి నుంచి నీటిని ఉత్పత్తి చేసే పరికరాన్ని ‘ఆట్మోస్పియరిక్ వాటర్ జనరేటర్’ కియోస్క్ సంస్థ ఏర్పాటు చేసింది. ఈ యంత్రానికి ‘మేఘ్‌దూత్’ అని పేరుపెట్టారు. గాలి నుంచి అంచెలంచెలుగా నీటిని నేరుగా సంగ్రహించడం అనే పద్ధతి ఈ వ్యవస్థలోని ప్రధాన అంశం. గాలి వడబోత పద్ధతి ద్వారా యంత్రంలోకి ప్రసరించడం వల్ల గాలిలోని తేమలో ఉండే కాలుష్యాల వడబోత జరుగుతుంది. వడబోత అయిన గాలి ఒక చల్లని గదిలోకి వెళ్ళి ఘనీభవిస్తుంది. ఈ ఘనీభవించిన గాలి నీటి బిందువులుగా మారి అక్కడ ఏర్పాటు చేసిన పాత్రలో పడుతుంది. అలా పట్టుబడిన నీరు అనేక స్థాయిల్లో వడబోతకు గురవడం వల్ల దాన్లోని చెడు వాసన, ఇతర కలుషితాలు హరిస్తాయి. ఆల్ట్రా వయొలెట్ (యువీ) సిస్టం ద్వారా ప్రవహిస్తుంది. ఈ విధంగా సేకరించిన నీటిలో అవసరమైన ఖనిజ లవణాలను కలుపుతారు. దీంతో అది తాగడానికి మంచినీరుగా వినియోగంలోకి వస్తుంది. ఈ పద్ధతిలో తయారైన నీటిని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెఓ గుర్తించింది. భారతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. సురక్షితమైన, ఆరోగ్యకరమైన నీటిని అందించే ఈ పద్ధతికి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆమోదం లభించింది. కియోస్క్ రూపొందించిన యంత్రం ద్వారా రోజూ 1,000 లీటర్ల నీటిని గాలి నుంచి ఉత్పత్తి చేస్తుంది. లీటర్ బాటిల్ మంచినీటిని రూ.8 రూపాయలకు విక్రయిస్తున్నారు. బాటిల్ లేకుండా మంచినీటిని రూ.5 రూపాయలకు ప్రయాణికులకు ఇస్తున్నారు. ఈ స్టోరేజీ ట్యాంక్ స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేశారు. వీటిలో ఎక్కువ రోజులు నీటిని నిల్వచేసుకోవడానికి అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పర్యావరణ రహితంగా, నీటి వనరులు లేకున్నా గాలితో నీటిని కియోస్క్ తయారు చేస్తుంది. దేశంలో దశల వారీగా కియోస్క్ యంత్రాన్ని అమలులోకి తీసుకువస్తామని దక్షిణ మధ్య రైల్వే జీం గజానన్ వెల్లడించారు. కియోస్క్ యంత్రాన్ని రూపొందించిన అధికారులను. సిబ్బందిని జీఎం ప్రశంసించారు. జోన్ పరిధిలోని ముఖ్యమైన రైల్వే స్టేషన్‌లలో కియోస్క్ యంత్రాన్ని అమలులోకి తీసుకురావాలని జీఎం అధికారులకు సూచించారు.

*చిత్రం...రైల్వే ప్రయాణికులకు నీటిని అందిస్తున్న కియోస్క్ సంస్థ ప్రతినిధులు