రాష్ట్రీయం

తెలుగు వర్సిటీ ఇన్‌చార్జి వీసీగా నీతుకుమారి ప్రసాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జి వైస్ ఛాన్సలర్‌గా సీనియర్ ఐఎఎస్ అధికారి నీతుకుమారి ప్రసాద్ నియమితులయ్యారు. ఇంత వరకూ ఐఎఎస్ అధికారి ఎ అనిల్ కుమార్ కొనసాగగా, ఆయన స్థానంలో నీతుకుమారిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ బీ జనార్ధనరెడ్డి గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా నిజమాబాద్‌లోని తెలంగాణ యూనివర్శిటీకి సైతం ఇన్‌ఛార్జిగా నీతుకుమారి ప్రసాద్ కొనసాగుతారు. ప్రస్తుతం ఆమె వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్‌గా కొనసాగుతున్నారు.