రాష్ట్రీయం

జోలె పట్టిన బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జనవరి 9: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు జోలె పట్టారు. కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నంలో అమరావతి ఐక్య పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమరావతి పరిరక్షణ ఉద్యమానికి ప్రజలంతా ఆర్థిక చేయూత ఇవ్వాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్ర రాజధాని అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గురువారం మచిలీపట్నంలో బహిరంగ సభ నిర్వహించారు. బహిరంగ సభకు ముందుగా చంద్రబాబు నాయుడు కోనేరుసెంటరు నుండి మున్సిపల్ కార్యాలయం వరకు అక్కడి నుండి తిరిగి కోనేరుసెంటరు వరకు జోలె పట్టి ప్రజల నుండి స్వచ్ఛందంగా విరాళాలు సమీకరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ తాను జీవితంలో తొలిసారిగా జోలె పట్టానన్నారు. నాడు ఉప్పు సత్యాగ్రహం పేరుతో మహాత్మ గాంధీ జోలి పట్టారని, ఆ తర్వాత ఆంధ్రుల ఆరాధ్య దైవం, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు అనేక సందర్భాల్లో ప్రజల కోసం జోలె పట్టారన్నారు. నేడు తాను ప్రజా రాజధాని అమరావతి పరిరక్షణ కోసం జోలె పట్టానన్నారు. ప్రజలంతా తమకు తోచిన విరాళాన్ని ఉద్యమ నిర్వహణ కోసం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నాడు ప్రజారాజధాని అమరావతి నిర్మాణానికి తాను ఇచ్చిన పిలుపునకు స్పందించిన ప్రజలు రూ.57 కోట్లు విరాళాలు ఇచ్చారని, రాజధాని ప్రాంత రైతులు 33వేల ఎకరాలను త్యాగం చేశారన్నారు. నేడు అమరావతి పరిరక్షణ కోసం ఇస్తున్న పిలుపుకు కూడా ప్రజలు ముందుకు వచ్చి ఉద్యమానికి బాసటగా నిలవాని చంద్రబాబు కోరారు.కాగా మచిలీపట్నంలో వివిధ వర్గాల ప్రజలు చంద్రబాబు పట్టిన జోలు ద్వారా రూ.3లక్షల 15వేలు నగదు, ఒక మహిళ తన బంగారు ఉంగరాన్ని విరాళంగా ఇచ్చారు. ఉయ్యూరు మాజీ ఎమ్మెల్యే అనే్న విజయలక్ష్మి లక్ష రూపాయలు, మన్మధరావు అనే వ్యక్తి లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. జోలె ద్వారా వచ్చిన మొత్తాన్ని జేఏసీ కన్వీనర్ శివారెడ్డికి చంద్రబాబు అందజేశారు.

'చిత్రం...జోలె పట్టి ఉద్యమానికి నిధులు సేకరిస్తున్న చంద్రబాబు