తెలంగాణ

మిషన్ ఇంద్ర ధనుష్ 85% లక్ష్యం సాధించాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 19: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంద్ర ధనుష్ అమలులో రాష్ట్రంలో ఇప్పటికే 85 లక్ష్యాన్ని సాధించామని వంద శాతం లక్ష్యాన్ని చేరుకుని దేశంలో ఆదర్శంగా నిలుస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి తెలిపారు. పిల్లలు వ్యాధుల బారిన పడకుండా వ్యాధి నిరోధక టీకాలు కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. బేగంపేటలోని టూరిజం ప్లాజాలో ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ మారు మూల గ్రామాల్లో సైతం టీకాలు ఇవ్వాలని, వంద శాతం లక్ష్యాన్ని సాధించాలని అన్నారు. టీకాలపై ప్రజల్లో అవగాహన కలిగించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో కొంత మందికి ఇప్పటికీ టీకాలపై అనుమానాలు, అపోహలు ఉన్నాయని, వాటిని తొలగించేందుకు డాక్టర్లు కృషి చేయాలని చెప్పారు. ఇటీవల అవసరం లేకపోయినా గర్భసంచి తొలగించే ఆపరేషన్లు ఎక్కువగా చేస్తూ చెడ్డపేరు తెచ్చుకున్నారని అన్నారు. అపరేషన్లపై ముందు అవగాహన కలిగించుకోవాలని చెప్పారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు చేసినట్టు చెప్పారు. డాక్టర్ల ఖాళీలను భర్తీ చేస్తున్నట్టు మంత్రి తెలిపారు.