రాష్ట్రీయం

ప్రాజెక్టులకు నిధులు పుష్కలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: దేశం మొత్తం మీద భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి పెట్టుబడుల విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. నిరుడు బడ్జెట్‌లో దేశంలోని అన్ని రాష్ట్రాలు కలిపి సాగునీటి రంగంలో రూ.5.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టగా, అందులో తెలంగాణ వాటా 12 శాతం, ఆంధ్రప్రదేశ్ వాటా 10 శాతం కావడం విశేషమని అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్) ప్రకటించింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇరిగేషన్‌కు ఎక్కువ నిధులు కేటాయించే విధానం పెరగడం వల్ల రాష్ట్ర స్ధాయిలో ప్రతి రాష్ట్రప్రభుత్వం ఇరిగేషన్ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేసుకోవాలని అసోచామ్ సూచించింది.
దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు సాగునీటి రంగానికి కేటాయించిన బడ్జెట్‌పై అసోచామ్ సంస్ధ ఒక పత్రాన్ని విడుదల చేసింది. 2004-05లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణలో ఇరిగేషన్ రంగంలో పెట్టుబడుల వాటా 6 శాతం ఉండగా, తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టులకు కేటాయింపుల వాటాను 12 శాతానికి పెంచింది. గుజరాత్‌లో 2004-05లో సాగునీటి రంగంలో పెట్టుబడుల వాటా 25 శాతం ఉండగా, గత 15 సంవత్సరాల్లో అంటే నిరుడు సంవత్సరానికి ఐదు శాతానికి పెట్టుబడి కేటాయింపులు పడిపోయాయి. సాగునీటి రంగంలో పబ్లిక్ సెక్టార్ పెట్టుబడులు 98 శాతం ఉన్నాయి. కాగా సాగునీటి రంగంలో పెట్టుబడులు పెరుగుతున్నందు వవల్ల విధాన నిర్ణయాలు, సేవలు పెంపు, జవాబుదారీతనం, పారదర్శకత ఉండాల్సిన అవసరం ఉందని అసోచామ్ సెక్రటరీ జనరల్ డిఎస్ రావత్ తెలిపారు. దేశం మొత్తం మీద ఇరిగేషన్‌లో పెట్టుబడులను విశే్లషిస్తే రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.5.5 కోట్లకు పెరిగింది. పది సంవత్సరాల్లో సాలీనా 10 శాతం చొప్పున ఈ రంగంలో పెట్టుబడులు పెరిగాయి. దేశంలో 361 ప్రాజెక్టుల్లో 248 ప్రాజెక్టులు రకరకాల కారణాల వల్ల పురోగతి మందగించింది. ఇందులో 189 ప్రాజెక్టులు వ్యయంపెరగడం, సకాలంలో పూర్తి కాకపోవడం జరిగిందని పేర్కొన్నారు. 178 సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం 61 శాతం పెరిగింది. అంటే ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.2.5 లక్షల కోట్ల నిధులు అవసరమనుకుని అంచనా వేస్తే వ్యయం రూ.4 లక్షల కోట్లకు పెరిగింది. నిధుల లేమి వల్ల వ్యయ భారం తెలంగాణలో 9 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 14 శాతం పెరిగింది. అన్నీ అనుకున్నట్లుగా జరిగిన రకరకాల కారణాల వల్ల ఒక ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేందుకు 125 నెలల పాటు జాప్యం జరుగుతోంది. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం సత్వరమే పూర్తయ్యేందుకు అందరినీ భాగస్వాములను చేయాలని, నాణ్యమైన నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వడం, ఆధునిక యంత్రాల వినియోగం పెరగాలని అసోచామ్ సిఫార్సు చేసింది.