రాష్ట్రీయం

చేయాల్సింది ఎంతో ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 20: ముఖ్యమంత్రి చంద్రబాబు తన జన్మదినం సందర్భంగా సభా వేదికపై నుంచి ఆప్యాయ భాషణ చేశారు. రాష్ట్ర ప్రజలందరితో తన జన్మదినం సందర్భంగా తన మనసులో మాట చెప్పుకోవాలని ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. హైదరాబాదు నుంచి కట్టుబట్టలతో తరలివచ్చిన 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుని వారికి మంచి చెయ్యాలన్నదే తన ఆరాటమన్నారు. ఇందుకోసం రోజుకు సుమారు 18 గంటలు పనిచేస్తున్నానన్నారు. హేతుబద్ధంగా లేని రాష్ట్ర విభజన 58 శాతం జనాభాకు 47 శాతం ఆదాయాన్ని కట్టబెట్టిందన్నారు. తమ 2 ఏళ్ల కృషి ఫలితంగా ఆదాయాన్ని 2.35 శాతం నుంచి 49.35 శాతానికి తేగలిగామన్నారు. ఇంకా చెయ్యవలసినది ఎంతో ఉందని, అవసరాలు అనేకం ఉన్నాయని ముఖ్యమంత్రి అన్నారు. మానవ వనరుల్లో ఆరోగ్యం, విద్య ప్రాధాన్యత గుర్తించి ఆ రంగాలను బలోపేతం చేస్తున్నామన్నారు. పట్టణ జనాభా తక్కువ ఉన్నందువల్ల రాష్ట్రంలో ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరగదన్నారు. ఇటీవల భారత - బ్రిటన్ ప్రధానుల సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు దేశంలో బ్రిటన్ ఏర్పాటు చెయ్యబోయే 11 అధునాతన ఆసుపత్రులలో అమరావతిలో ఒకటి ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఈ 11 ఆసుపత్రులకు ప్రధాన పరిపాలన కేంద్రం కూడా అమరావతిలోనే ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ కృషిలో అందరూ కలసి ముందుకు నడిస్తే రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం పెద్ద కష్టం కాదన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి చిన్నారులకు రోటావైరస్ వాక్సిన్ వేశారు. సంచార చికిత్స లబ్థిదారులకు ఇచ్చే కార్డులు కొత్త వాక్సినేషన్ షెడ్యూలును ముఖ్యమంత్రి విడుదల చేశారు.
దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు
తన 66వ జన్మదినాన్ని పురస్కరించుకుని బుధవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ ఆజాద్ ముఖ్యమంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనానికి తోడ్కొని వెళ్లారు. వేద పండితులు పూర్ణకుంభం, వేద మంత్రాల నడుమ ముఖ్యమంత్రి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారి శేషవస్త్రాలను, చిత్రపటాన్ని, ప్రసాదాన్ని ఇఓ చంద్రశేఖర్ ఆజాద్ ముఖ్యమంత్రికి, ప్రజా ప్రతినిధులకు అందజేశారు. కనకదుర్గమ్మకు నిత్య మహానివేదన ఉపయోగార్థం ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మూడు కేజీల వెండి మహాపాత్రను బహూకరించారు. చంద్రబాబు చేతుల మీదుగా వెండిపాత్రను ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ ఆజాద్‌కు అందజేశారు.
శుభాకాంక్షలు తెలిపిన ప్రజా ప్రతినిధులు
అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు, రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, గంటా శ్రీనివాసరావు, ఎంపీలు కేశినేని నాని, కంభంపాటి రామమోహనరావు, సిఎం రమేష్, శాసనమండలి సభ్యులు బుద్ధా వెంకన్న, స్థానిక శాసనసభ్యులు జలీల్‌ఖాన్, తిరుపతి శాసనసభ్యురాలు సగుణ, టిటిడి ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, స్థానిక నాయకులు నాగుల్ మీరా, టిడిపి జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు తదితరులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

chitram పుట్టినరోజు సందర్భంగా విజయవాడలో కేక్ కట్ చేస్తున్న చంద్రబాబు