రాష్ట్రీయం

పేదలందరికీ ఆధునిక వైద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 20: రాష్ట్రంలో పేదలందరికీ మెరుగైన అధునాతన వైద్యసేవలు అందించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని, నూతన చికిత్స విధానాలను జత చేసి ఉత్తమ ఫలితాలను సాధించాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు. ప్రజల వైద్య ఖర్చులు తగ్గించే దిశలో పలు సంస్కరణలు తమ ప్రభుత్వం చేపడుతున్నదని ముఖ్యమంత్రి అన్నారు. ఇందులో భాగంగానే చంద్రన్న సంచార చికిత్స ప్రాజెక్టును ఆయన తన జన్మదినం సందర్భంగా ఆవిష్కరించారు. స్థానిక నాక్ కల్యాణ మండపం ప్రాంగణంలో 275 మొబైల్ ప్రాథమిక చికిత్స కేంద్రాలను ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాధులకు చికిత్స చేసే స్థాయి నుండి, వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా ప్రజలను సమాయత్తపరచడంపై చర్యలు తీసుకుంటామన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో ప్రజారోగ్యం కుంటుపడిందన్నారు. మన రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన వైద్యులకు కొరత లేదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయ వైద్యులలో 33 శాతం మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారని ముఖ్యమంత్రి అన్నారు. ఆరోగ్య రంగం జాబితాలో రాష్ట్రాన్ని కేరళ రాష్ట్రం కంటే పైన ఉండేవిధంగా పలు పథకాలు అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా కేంద్ర ఆసుపత్రులలో మెరుగైన వౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. పేద రోగులకు ఉచితంగా వ్యాధి నిర్థారణ పరీక్షలు, ఒకేచోట లభించేలా పొరుగు సేవల పద్ధతిలో కల్పించామన్నారు. ఆసుపత్రులలో పారిశుద్ధ్య పనులు, ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చి కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా పారిశుద్ధ్యం ఉండేలా చూస్తామన్నారు. ప్రతి రోజు ఆసుపత్రి బెడ్‌పై ఉన్న దుప్పటి మార్చేందుకు వీలుగా 7 రోజులకు 7 రంగుల దుప్పట్లు ప్రవేశపెడుతున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడిచారు. ఇదేవిధంగా రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవల మొత్తాన్ని సంవత్సరానికి లక్ష నుంచి లక్షా ఇరవై ఐదు వేలకు పెంచినట్లు, అదనంగా 250 వైద్యసేవలను ఆరోగ్యశ్రీలో ప్రవేశపెట్టినట్లు ముఖ్యమంత్రి వివరించారు. అన్ని ఏరియా ఆసుపత్రులలో డయాలసిస్ ఉచితంగా అందిస్తామన్నారు.
వైద్యసేవల్లో ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగం
రాష్ట్రంలో టెలిమెడిసన్ విధాన్ని అమలులోకి తెచ్చామని రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న వైద్య పథకాల తీరు తెన్నులు, డాక్టర్ల సేవల వివరాలు, పారిశుద్ధ్యం పనుల వంటివి ఇకపై తమ సెల్‌ఫోన్‌లో చూసి తెలుసుకోగలిగిన విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరచామన్నారు. టెలి- రేడియాలజీ వంటి సేవలు అమలు చేస్తున్నామన్నారు. సిటి స్కాన్ పరికరాలను బుధవారం చీరాల, టెక్కలి, గూడూరు, ప్రొద్దుటూరు ఆసుపత్రులలో ఏర్పాటు చేశామన్నారు.
స్థిరంగా జనాభా వృద్ధి రేటు
రాష్ట్ర జనాభా వృద్ధిరేటు స్థిరంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. ఈ రేటు తిరోగమన దిశలో ప్రవేశిస్తే పలు దుష్టపరిణామాలు చోటు చేసుకుంటాయన్నారు. ఉత్పాదకత వయసు కలిగిన జనాభా తగ్గి వృద్ధుల సంఖ్య పెరుగుతుందన్నారు. ఇటువంటి పరిణామాలు జపాన్, చైనా ఇతర దేశాలలలో స్పష్టంగా చూస్తున్నామన్నారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో 150 పడకల ఆసుపత్రులను 12 నిర్మించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. 1400 మంది వైద్యులు, 1000 మంది పారా మెడికల్ సిబ్బంది నియామకానికి చర్యలు చేపడుతున్నామన్నారు. . కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, పలువురు రాష్ట్ర మంత్రులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

chitram సంచార వైద్య వాహనాలను ప్రారంభిస్తున్న్ ముఖ్యమంత్రి చంద్రబాబు