రాష్ట్రీయం

ఇక తాడోపేడో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: క్వాలిటీ పేరుతో పొలీసులు, విజిలెన్స్ బృందాలతో తనిఖీలు నిర్వహిస్తున్న ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్న తెలంగాణ విద్యాసంస్థల యాజమాన్యాలు తమ సంస్థలను మూసివేశాయి. దాదాపు ఆరువేల సంస్థలు ఈ జాబితాలో చేరాయి. కాలేజీలపై పోలీసు, విజిలెన్స్ దాడులను తాము ఎంత మాత్రం సహించేది లేదని యాజమాన్యాల ప్రతినిధులు బుధవారం మరో మారు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి స్పష్టం చేశారు. అయితే పాలిసెట్ నిర్వహణకు మాత్రం తాము సహకరించాలని నిర్ణయించుకున్నామని యాజమాన్యాల జాక్ నేతలు వెల్లడించారు. విద్యార్ధుల భవిష్యత్, తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు విజ్ఞప్తి మేరకు పరీక్షకు సహకరించాలని నిర్ణయించామని అన్నారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో సానుకూలంగా చర్చలు జరిగాయని, ప్రైవేటు విద్యాసంస్థలపై పోలీసుల తనిఖీలు రాజ్యాంగ బద్ధం కాదని, అందువల్లే తాము దానిని వ్యతిరేకిస్తూ ఆందోళన బాట పట్టామని స్పష్టం చేశామని వారు చెప్పారు. ఈ నెల 22వ తేదీన మరోమారు సమావేశమై కానిస్టేబుల్, ఎమ్సెట్ తదితర పరీక్షలకు సహకరించాలా వద్దా అనే విషయమై నిర్ణయం ప్రకటిస్తామని అన్నారు. కొంత మంది అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదారిపట్టిస్తున్నారని వారు ఆరోపించారు. విద్యాశాఖ అధికారులతో విచారణ చేయిస్తే సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ముఖ్యమంత్రి తమ సమస్యలను పరిష్కరించాలని వారు పేర్కొన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలపై పోలీసు తనిఖీలను ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకూ సమ్మె కొనసాగుతుందని జాక్ నేతలు గౌతం రావు, జి రమణా రెడ్డి, సూరం ప్రభాకర్‌రెడ్డి, డాక్టర్ కె రాం దాస్ తదితరులు పేర్కొన్నారు.