రాష్ట్రీయం

రాజకీయ ప్రకంపనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 8: విజయవాడ నగరంలోని స్వర్ణబార్ అండ్ రెస్టారెంట్‌లో కల్తీమద్యం సేవించి ఐదుగురు బలికావటం, మరో 28 మంది అస్వస్థతకు గురైన ఘటన క్రమేణ రాజకీయ ప్రకంపనలను సృష్టిస్తున్నది. విపక్షాలన్నీ ఏకమై రాష్ట్ర ప్రభుత్వంపై దాడికి దిగతుంటే మద్యం దుకాణం నగర కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కుటుంబానికి చెందినది కావటం పైగా ఈ కేసులో తొమ్మిదో నిందితుడిగా విష్ణు ఉండటాన్ని ఆసరాగా తీసుకుని తెదే నేతలు కాంగ్రెస్ పార్టీపై ఎదురుదాడికి దిగుతున్నప్పటికీ విపక్షాల దాడిని ధీటుగా ఎదుర్కొలేకపోతున్నారు. తెదే నేతలు ఆరోపిస్తున్నట్లుగా ఆ బార్‌లో ఉద్దేశ్యపూర్వకంగా కల్తీ జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా 9 మద్యం బ్రాండ్‌లను ఎందుకు సీజ్ చేయాల్సి వచ్చింది... జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలన్నింటినీ ఎందుకు మూసివేయాల్సి వచ్చిందని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఏదిఏమైనా ప్రత్యర్థుల విమర్శలు, ఆరోపణలతో రాష్ట్ర ఎక్సైజ్ శాఖమంత్రి కొల్లు రవీంద్ర ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మంత్రి కొల్లు రవీంద్ర ఇటీవల నగరంలోనే నివాసాన్ని ఏర్పాటు చేసుకోవటం అన్నింటి మించి ముఖ్యమంత్రి పాలన ఇక్కడనుంచే సాగుతుండటంతో విపక్షాల ఆందోళనలు క్రమేణ తీవ్రరూపం దాల్చుతున్నయి. ప్రత్యక విశేషం ఏమిటంటే చిరకాల ప్రత్యర్థి అయిన మాజీ మంత్రి, పిసిసి ఉపాధ్యక్షులు దేవినేని నెహ్రూ సైతం విష్ణును వెనకేసుకు వస్తూ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. గోదావరి పుష్కరాల్లో జరిగిన దుర్ఘటనకు సిఎంను బాధ్యునిగా ఆరోపించాయని ప్రశ్నించారు. సిఎం సతీమణి హెరిటేజ్ ఫ్యాక్టరీ నడుపుతున్నారు. ఎక్కడైనా కల్తీ జరిగితే ఆమెను బాధ్యురాలిని చేస్తారా అని పలువురు కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇక కల్తీమద్యం దుర్ఘటన జరిగిన కృష్ణలంక ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తెదే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అయితే చైతన్యయాత్రలో ఆ ప్రాంత ప్రజలు మద్యం దుకాణాలను తెల్లవారేసరికి తెరచి మద్యం విక్రయిస్తున్నారని ఫిర్యాదు చేస్తే తాను స్వయంగా అధికారుల దృష్టికి తీసుకువచ్చినా ప్రయోజనం లేకుండా పోయిందని చెబుతున్నారు. బాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కల్తీమద్యం ఘటనలు జరిగినప్పుడు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా కోసం డిమాండ్ చేసినాడు ఐదు లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ మద్యం పాలసీపై విపక్షాలన్నీ ఏకమై ధ్వజమెత్తుతున్నాయి.

మద్యం దుకాణాలపై ఎక్సైజ్ దాడులు

గుంటూరు, డిసెంబర్ 8: విజయవాడ కల్తీ మద్యం ఘటన నేపథ్యంలో జిల్లాలోని అన్ని వైన్‌షాపులు, బార్ అండ్ రెస్టారెంట్‌లను ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది విస్తృతంగా తనిఖీ చేశారు. జిల్లావ్యాప్తంగా సుమారు 250 మద్యం, బార్ షాపులున్నట్లు సిబ్బంది తెలిపారు. మంగళవారం స్వర్ణబార్‌లో కల్తీ మద్యం సేవించి ఐదుగురు మృతి చెందిన విషయం విదితమే. ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవటంతో ఎక్సైజ్ అధికారులు కల్తీ అనవాళ్లు పసి గట్టేందుకు దాడులు కొనసాగించారు. ఆఫీసర్ ఛాయిస్ 120 బ్రాండ్‌ను సేవించిన వారు అసుపత్రి పాలైనారు. ఈనేపథ్యంలో రాయల్ స్టాగ్ 26, ఎఎబి 67, ఎంసి 9, ఒరిజినల్ ఛాయిస్ 12, ఓసి 77, ఐబిఎం 100, డిఎస్‌పి 143, ఎంసి 122, ఎఎబి 57 తదితర బ్రాండ్‌లను తాత్కాలికంగా నిషేధించారు. నరసరావుపేట, చిలకలూరిపేట, చేబ్రోలు, మంగళగిర తదితర ప్రాంతాల్లో ఎక్సైజ్ అధికార సిబ్బంది దాడుల్లో పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా తనిఖీలు నిర్వహించినట్లు ఎక్సైజ్‌శాఖ డిసి పి శ్రీమన్నారాయణ వెల్లడించారు. ఈ సందర్భంగా మద్యం దుకాణాల్లో శాంపిల్స్ సేకరించటం జరిగిందన్నారు. విజయవాడలో చోటుచేసుకున్న సంఘటన దురదృష్టకరమన్నారు. నిందితులు ఎంతటి వారైనా వదిలి పెట్టేది లేదన్నారు. ఇప్పటికే కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారని, నిందితులపై చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రత్తిపాటి అన్నారు.