రాష్ట్రీయం

ఒకరు కాల్చారు.. మరొకరు వాతలు పెట్టారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, ఏప్రిల్ 20: ‘మేము రాత్రి అన్నం తింటుంటే బుచ్చమ్మ పొయ్యిపై చెంచాను వేడిచేసింది. దానిని పద్మకిస్తే, ఆమె మా చేతులపై కాల్చింది. చేతిపై బొబ్బలచ్చి మేము ఏడుస్తుంటే శారద చూసింది’ అంటూ చిన్నారులు వచ్చీరాని మాటలతో కన్నీళ్లతో చెబుతుంటే కలెక్టర్ నీతూ ప్రసాద్ చలించిపోయారు. శిశుగృహంలోని ఆయాల అమానుషత్వాన్ని కళ్ళకు కట్టినట్లుగా చెబుతూ, కన్నీరు పెట్టడంతో కలెక్టర్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తమ చేతులపై పెట్టిన వాతల గాయాలు చూపుతూ దీనవదనాలతో కనిపించగానే శిశుగృహకు పరామర్శకు వెళ్ళిన వారిని కలిచివేసింది. బాలలు ఉన్న గదికి కలెక్టర్ నీతూ ప్రసాద్ వెళ్ళగానే ‘అమ్మా..’ అంటూ గాయాలను చూపడంతో కలెక్టర్ ఒక్కసారిగా వారిని అక్కున చేర్చుకున్నారు. ఈ ఘటన 15వ తేదీన జరిగితే ఇప్పటివరకు తనకు ఎందుకు సమాచారమివ్వలేదంటూ ఐసిడిఎస్ పిడిపై తీవ్రంగా మండిపడ్డారు. కారణాలు చెప్పబోయన పిడిని కసురుకున్నారు. సమాచార సమన్వయ లోపంపై ఇప్పటికే పలుమార్లు సూచించినా పట్టించుకోవటంలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
చిన్నారుల చేతులపై వాతలు పెట్టి అయిదు రోజులు కావస్తున్నా బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ సంబంధిత అధికారి తీరుపట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సరెండర్ చేసేందుకు ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. కన్నతల్లుల్లా వ్యవహరించాల్సిన ఆయాలు అల్లరి చేస్తున్నారనే సాకుతో వాతలు పెట్టడంపై తీవ్రస్థాయిలో స్పందించారు. రాత్రిపూట విధులు నిర్వహించిన ముగ్గురు ఆయాలను తొలగిస్తూ, నిత్యం పర్యవేక్షించాల్సిన మేనేజర్, సామాజిక కార్యకర్తలు కూడా సకాలంలో స్పందించకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ వీరిని కూడా ఉద్యోగాల్లోంచి తొలగిస్తూ ఆదేశాలు జారీచేశారు. అలాగే, సంఘటనకు కారకులైన ఆయాలు బుచ్చమ్మ, పద్మలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో ఐసిడిఎస్ పిడి మోహన్‌రెడ్డి రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేయగా, గాయాలకు గురైన చిన్నారులు గీత, స్వరూప, రాజన్‌లను శిశుగృహలో ప్రత్యక్షంగా పరిశీలించి, బాధ్యులైన ఇద్దరు ఆయాలపై ఐపిసి 324, సెక్షన్ 75,82/2015 జువైనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదుచేశారు. కాగా, సంఘటనపై ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి కలెక్టర్‌కు ఫోన్ చేసి ఆరా తీసినట్లు తెలుస్తోంది. చిన్నారులపై కర్కశంగా వ్యవహరించిన వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించినట్లు సమాచారం.

చిత్రం చేతులపై ఆయమ్మ కాల్చిందంటూ
కలెక్టర్‌కు చూపిస్తున్న చిన్నారులు