రాష్ట్రీయం

దేశానికి త్రిభాషాసూత్రమే ఆధారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 21: దేశానికి త్రిభాషా సూత్రమే ఆధారం కావాలని, అందరూ ఇంగ్లీషు, హిందీ నేర్చుకోవాలని అదేం తప్పు కాదని, అంత మాత్రాన మాతృ భాషను నిర్లక్ష్యం చేయరాదని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. తాజ్ డక్కన్ హోటల్‌లో గురువారం నాడు నిర్వహించిన హిందీ సలహా మండలి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మాతృభాషను ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని, ఆంగ్లభాషను నేర్చుకోవడంలో తప్పేమీ లేదని అన్నారు. మాతృభాషను మాత్రం తక్కువ చేయవద్దని, దేశంలో హిందీ భాషను ప్రోత్సహించాల్సిందేనని అన్నారు. ఇందుకోసం దేశంలో త్రిభాషా సూత్రాన్ని తప్పక పాటించాలని సూచించారు. కాగా బడ్జెట్ సమావేశాల రెండో విడత పార్లమెంటు సమావేశాలు ఈ నెల 25వ తేదీన ప్రారంభం అవుతాయని, సమావేశాలు వచ్చే నెల 13 వరకూ జరుగుతాయని చెప్పారు. ఈ సందర్భంగా పార్లమెంటులో రైల్వే బడ్జెట్‌పైనా, సాధారణ బడ్జెట్‌పైనా విస్తృతంగా చర్చ జరుగుతుందని చెప్పారు. వివిధ స్టాండింగ్ కమిటీలు చేసిన సిఫార్సులను సైతం పార్లమెంటు చర్చిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా లోక్‌సభలో 13 కీలకమైన బిల్లులను ప్రవేశపెడతామని అన్నారు. ఈ సమావేశాల్లోనే జిఎస్‌టి బిల్లును ఆమోదించే ప్రయత్నం చేస్తామని చెప్పారు.