రాష్ట్రీయం

స్పీకర్‌దే తుది నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: వైకాపా ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు శాసనసభ స్పీకర్‌కు వదిలిపెట్టింది. ఈ వివాదంపై రోజా రాసిన లేఖను పరిగణనలోకి తీసుకొని సస్పెన్షన్‌పై నిర్ణయం తీసుకోవాల్సిందిగా స్పీకర్‌కు ధర్మాసనం సూచించింది. అదే సమయంలో రోజా సస్పెన్షన్‌పై హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం వద్ద విచారణలో ఉన్న పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అవకాశం కల్పించింది. శాసనసభనుంచి తనను సస్పెండ్ చేయడంపై హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రోజా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై రెండవ రోజు కూడా వాదనలు కొనసాగాయి. జస్టిస్ గోపాలగౌడ, జస్టిస్ అరుణ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. సుప్రీంకోర్టు సూచన మేరకు రోజా స్పీకర్‌కు రాసిన లేఖను రోజా తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు అందజేశారు. తాను ఉద్దేశపూర్వకంగా ఎవరిపైనా వ్యాఖ్యలు చేయలేదని, సభనుగానీ, సభ్యులనుగానీ కించపరచలేదని రోజా స్పష్టం చేశారు. ఒకవేళ సభను అవమానపరిచినట్లు భావిస్తే, తాను వాటిని ఉపసంహరించుకుంటానన్నారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ తరపు న్యాయవాది పీపీ రావు జోక్యం చేసుకుని రోజా ఏక్కడా శాసనసభ పరిణామాలపై క్షమాపణ చెప్పలేదని కోర్టుకు వివరించారు. అయితే రోజా రాసిన లేఖను శాసనసభ స్పీకర్ పరిగణనలోకి తీసుకుని అసెంబ్లీ బిజినెస్ రూల్స్ ప్రకారం ఎనిమిది వారాల్లోపునిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. కాగా నిర్దిష్ట సమయంలో లేఖపై నిర్ణయం తీసుకునేలా స్పీకర్ ఆదేశించాలంటూ రోజా తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్ చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తరపు న్యాయవాది పీపీ రావు జోక్యం చేసుకుని రోజా లేఖను సభ పరిశీలిస్తుందన్నారు. తదుపరి విచారణను వేసవి సెలవులు అనంతరం ఆగస్టు మొదటి వారానికి న్యాయస్థానం వాయిదా వేసింది.
అసెంబ్లీ ప్రాంగణంలోకి
రోజా వెళ్లొచ్చు
ఒక సందర్భంలో రోజా తరపున్యాయవాది తన వాదన వినిపిస్తూ తన క్లయింట్‌ను శాసనసభ ప్రాంగణంలోకి సైతం అనుమతించడం లేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆమెను సభాప్రాంగణంలోని పార్టీ కార్యాలయానికి అనుమతించాలని అసెంబ్లీ సెక్రటరీని సుప్రీంకోర్టు ఆదేశించింది. రోజాను అసెంబ్లీలోకి, ప్రాంగణంలోకి అనుమతించకపోతే తాము తీవ్రంగా పరిగణిస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది.
వివాదానికి సభ
ఫుల్‌స్టాప్ పెట్టాలి: రోజా
అసెంబ్లీని సుప్రీంకోర్టు గౌరవిస్తూ నిర్ణయాన్ని శాసనసభకే వదిలేసిందని, అసెంబ్లీ కూడా సుప్రీంకోర్టును గౌరవించి వివాదానికి ముగింపు పలకాలని వైకాపా ఎమ్మెల్యే రోజా కోరారు. తనకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదనే పోరాటం చేస్తున్నట్లు పేర్కొన్నారు. పంతాలకు పోకుండా సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని, సుప్రీంకోర్టు సూచనల మేరకు అసెంబ్లీ నడుచుకుంటుందని రోజా ఆశాభావం వ్యక్తం చేశారు.