రాష్ట్రీయం

సేద్యానికి చేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 22: ఇజ్రాయిల్ తరహాలో రాష్ట్రంలో వ్యవసాయరంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్లాస్టిక్‌కు మానవ జీవితంతో విడదీయరాని బంధం ఉందని, ప్రధానంగా వ్యవసాయ రంగంలో డ్రిప్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ పరికరాల తయారీలో ప్లాస్టిక్‌కు తగిన ప్రాధాన్యం ఉందని అన్నారు. రాష్ట్రంలో వెయ్యి కోట్లతో అగ్రీ ప్లాస్టిక్ పార్క్ ఏర్పాటుకు కేంద్రం ముందుకొచ్చినందున కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలో 250 ఎకరాల స్థలం కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ పార్కువల్ల దాదాపు లక్షమందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. అలాగే విశాఖ జిల్లాలో బల్క్ డ్రగ్ పార్కు కోసం 500 ఎకరాలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలో 12 ఎకరాల విస్తీర్ణంలో రూ.50 కోట్లతో నిర్మించనున్న సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీ (సీపెట్) సంస్థ భవనాల నిర్మాణానికి శుక్రవారం సాయంత్రం కేంద్ర మంత్రులు అనంత్‌కుమార్, వెంకయ్య నాయుడుతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా సిఎం మాట్లాడుతూ ఇజ్రాయిల్‌లో మొక్కలకు ఎరువును, నీటిని బొట్లుబొట్లుగా ఇవ్వడం ద్వారా దిగుబడిలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారన్నారు. ఇలా చేయడం వల్ల ఒక ఎకరా సాగుకు సరిపడే నీటిని మూడు ఎకరాలకు వినియోగించవచ్చన్నారు. ఈ తరహా సేద్యానికి ప్లాస్టిక్ పరికరాల అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇక్కడ ప్రారంభం కానున్న సీపెట్ ఆ దిశగా పరిశోధనలను విస్తృతం చేయాలన్నారు. సీపెట్ విద్యార్థుల శిక్షణకు 5 వేల చదరపు అడుగుల ప్రాంతాన్ని ఇచ్చేందుకు చుక్కపల్లి ఐటిఐ అంగీకరించిందంటూ రెండు నెలల్లో శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించాలన్నారు. కంపోస్టు ఎరువుపై టన్నుకు రూ.1500 చెల్లించేందుకు రసాయనాలు, పెట్రోలియం శాఖ అంగీకరించినందున గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో వెలువడుతున్న వ్యర్థాలను వినియోగించి కంపోస్ట్ ఎరువు తయారీకి శ్రీకారం చుట్టాల్సిందిగా చంద్రబాబు పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ చొరవతో ఈ ఏడాది ఎరువుల కొరత రాలేదని చెప్పారు. కడప జిల్లా అనంతపురంలో మరో సీపెట్ కేంద్రాన్ని నెలకొల్పేందుకు, అలాగే రాష్ట్రంలో ఫార్మా-డి ఎడ్యుకేషన్ రీసెర్చి జాతీయ సంస్థ ఏర్పాటుకు మంత్రి అనంతకుమార్ ముందుకొచ్చారంటూ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర మహిళా పారిశ్రామికవేత్తల సంఘానికి వీరపనేనిగూడెంలో 25 ఎకరాలు మంజూరు చేస్తున్నట్లు ఈ సందర్భంగా చంద్రబాబు ప్రకటించారు.
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ నేడు ధరిత్రి దినం సందర్భంగా ప్రతిఒక్కరూ ప్రకృతిని పరిరక్షించటానికి, నీటి వృథాను తగ్గించటానికి కంకణం కట్టుకోవాలని పిలుపిచ్చారు. ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తూ పర్యారవణ కాలుష్యాన్ని తగ్గించుకోవాలన్నారు.
కేంద్ర మంత్రి అనంతకుమార్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వ్యర్థాలను మాత్రమే దూరంగా ఉంచాలని, ప్లాస్టిక్‌ను కాదన్నారు. ప్లాస్టిక్ ఆధునిక మానవ అవసరాలకు ఆలంబనగా మారిందన్నారు. సీపెట్ కేంద్రాలు, అగ్రీ ప్లాస్టిక్ ఇంజనీరింగ్, అగ్రీ ప్లాస్టిక్ టెక్నాలజీలను బోధిస్తాయన్నారు. ఏటా 5 వేల మంది విద్యార్థులకు విద్యాబోధన, శిక్షణ ఇవ్వగలగే స్థాయిలో ఈ కేంద్రాన్ని రూపొందిస్తామన్నారు. కేంద్ర రసాయనాలు, ఎరువుల సహాయ మంత్రి హంసరాజ్ గంగారామ్ అహిత్ మాట్లాడుతూ దేశంలోని ప్లాస్టిక్ రంగంలో నిపుణుల కొరత ఈ సీపెట్‌లో కేంద్రం ద్వారా తీరనుందని చెప్పారు.

చిత్రం సీపెట్ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు,
కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, అనంతకుమార్