రాష్ట్రీయం

నిన్న నినే్న..నేడు నేడే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: నిన్న నినే్న..నేడు నేడే! కాలగమనంలో ఏదీ శాశ్వతం కాదు. తెలంగాణ ఉద్యమ వేడిలో సమైకాంధ్రకు కట్టుబడ్డ సినీ పరిశ్రమ ఇప్పుడు రూటు మార్చింది. ఒకప్పుడు ఉద్యమ నాయకుడు కెసిఆర్‌ను విమర్శించిన సినీ పెద్దలు ఇప్పుడు చేరువవుతున్నారు. అప్రతిహత ఉద్యమంతో తెలంగాణ సాధించి కొత్త రాష్ట్రానికి సిఎం అయిన ఆయన్ని సినిమాల ప్రారంభోత్సవాలకు పిలవడానికి క్యూలు కడుతున్నారు. అదే స్థాయిలో ఉద్యమ కాలంలో సినీ పరిశ్రమను తీవ్రంగా విమర్శించిన కెసిఆర్ ఇప్పుడు దానికి చేరువవుతున్నారు. సమైక్యాంధ్ర కోసం మోహన్‌బాబు కుటుంబం ఆందోళన చేస్తే..నందమూరి హరికృష్ణ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. చిరంజీవి, పవణ్ కళ్యాణ్‌లు.. ఒకరిద్దరేమిటి సినీ ప్రముఖులంతా కెసిఆర్‌పై విరుచుకు పడేవారు. కెసిఆర్ కూడా అదే స్థాయిలో తన ఆగ్రహాన్నీ వ్యక్తం చేసేవారు. ఇప్పుడు పాత్రలు మారాయి. తెలుగు సినిమా పెద్దలు ఒకరి తరువాత ఒకరు కెసిఆర్‌ను కలుస్తుంటే కెసిఆర్ సినిమా ఫంక్షన్‌లకు సైతం వెళుతూ సినిమా వారిని అభినందనలతోముంచెత్తుతున్నారు.
బాలకృష్ణ వందవ సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కెసిఆర్ సినిమా పెద్దలు పరస్పరం అభినందనలతో ముంచెత్తుకున్నారు. కెసిఆర్ మాట్లాడేందుకు మైకు అందుకోగానే సినిమా వాళ్లు ఈలలతో ఉత్సాహంగా స్వాగతం పలికారు. కెసిఆర్ ప్రసంగిస్తున్నంత సేపు విజిల్స్ మోతమ్రోగాయి.
ఎన్టీఆర్ అంటే తనకు ఎంతో అభిమానం అంటూ కెసిఆర్ తన ఉపన్యాసాన్ని ప్రారంభించారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని ఇష్టపడని తెలుగువారు లేరని అన్నారు. ఇటీవల పలువురు సినిమా తారలు కెసిఆర్‌ను అభినందలతో ముంచెత్తుతున్నారు. పవన్ కళ్యాణ్ ఇటీవల తన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా సమయంలో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కెసిఆర్ పాలన బాగుందని అభినందించారు. కెసిఆర్ అధికారంలోకి వచ్చాక బాలకృష్ణ, మోహన్‌బాబు వంటి వారు సైతం ఆయన్ని కలిసి అభినందించారు.
కానీ తెలంగాణ ఏర్పడిన తరువాత అప్పటి వరకు ఉప్పు నిప్పులా ఉన్న కెసిఆర్ ఇప్పుడు సినిమా వాళ్లకు ఇంత దగ్గర కావడంపై తెలంగాణ వాదుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన ధోరణిని కొందరు వ్యతిరేకిస్తూంటే మరికొందరు ఉద్యమ కాలం వేరు. ముఖ్యమంత్రి బాధ్యతలు వేరంటూ సమర్ధిస్తున్నారు.

చిత్రం శుక్రవారం బాలకృష్ణ 100వ చిత్రం శాతకర్ణి ప్రారంభోత్సవానికి క్లాప్ కొడుతున్న
తెలంగాణ సిఎం కెసిఆర్. పాల్గొన్న చిరంజీవి, మంత్రి తలసాని, దాసరి, వెంకటేశ్