రాష్ట్రీయం

దీపాలు వెలిగె!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 23: ఎల్‌ఇడి బల్బుల పంపిణీలో దేశంలోనే అగ్రగ్రామిగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ తాజాగా మరో రికార్డు నెలకొల్పబోతోంది. గృహ విద్యుదీకరణలో మే నెలాఖరు నాటికి 100 శాతం లక్ష్యాన్ని పూర్తి చేయనుంది. గిరిజన ప్రాంతాలతో కలిపి అన్ని చోట్లా వంద శాతం గృహ విద్యుదీకరణ పూర్తయిందనీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వందశాతం విద్యుదీకరణ కార్యక్రమాన్ని జూన్ 8న జాతికి అంకితం చేస్తారని ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. దేశం మొత్తం మీద వంద శాతం గృహ విద్యుదీకరణ పూర్తయిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మొదటి స్ధానంలో నిలుస్తుందన్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖ 2014-15లో 1.37 లక్షల ఇళ్లకు, 2015-16లో 2.37 ఇళ్లకు విద్యుద్దీకరణ పూర్తి చేసిందన్నారు. ఈ ఏడాది మే నెలాఖరునాటికి 2.09 ఇళ్లకు విద్యుద్దీకరణ పూర్తవుతుందన్నారు. విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా ఉన్నత ప్రమాణాలతో కూడిన ట్రాన్స్‌ఫార్మర్లను సరఫరా చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై పదివేల మంది ఉద్యోగులతో ఏకకాలంలో టెలికాన్ఫరెన్సును నిర్వహించినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం 158 ఎంయు విద్యుత్ డిమాండ్ పెరిగిందన్నారు. వచ్చే మే నెలలో విద్యుత్ డిమాండ్ ఇంకా పెరుగుతుందన్నారు.

చిత్రం అజయ్ జైన్