రాష్ట్రీయం

మెడిసిన్‌కు చికిత్స!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 23: ఆధునిక అవసరాలు తీర్చలేకపోతున్న ఎంబిబిఎస్ డాక్టర్ చదువు ఎందుకూ పనికి రావడం లేదని ఆరోగ్యం కుటుంబ సంక్షేమంపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వ్యాఖ్యానించింది. వైద్య విద్య, ఎంసిఐ తీరు తెన్నులపై 134 పేజీల నివేదిక (రిపోర్టు 92)ను సమర్పించింది. ఈ నివేదికపై రెండో దశ బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంటు చర్చించనుంది. ఈ నివేదికలో యుజి, పిజి చదువులతో పాటు ఎంసిఐ అవినీతిపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కడిగిపారేసింది. వైద్య విద్యను మెరుగుపరచాల్సిన ఆవశ్యకతను, సిలబస్‌లో మార్పులు, చేర్పుల గురించి కూడా విస్తృతంగా చర్చించింది. వైద్య విద్య అండర్ గ్రాడ్యూయేషన్ కోర్సు ఆశాజనకంగా లేదని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అభిప్రాయపడింది. వైద్య విద్యలో, నైపుణ్యంలో ఎంబిబిఎస్ కోర్సు పాత్ర చాలా కీలకమని, కాని వస్తున్న జబ్బులకు, ఎంబిబిఎస్ చదువులకూ పొంతన ఉండటం లేదని పేర్కొంది. అండర్ గ్రాడ్యూయేట్ కోర్సు నాణ్యత లేకుండా పోయిందని, కొత్త కొత్త జబ్బులు వస్తున్నా, చదువు మాత్రం సంప్రదాయపద్ధతిలో కొనసాగుతుందని, ఆధునిక వైద్య పద్ధతులను అవలంభిస్తే గానీ ఈ కొత్త జబ్బులకు పరిష్కారం దొరకదని పేర్కొంది. 14 ఏళ్ల క్రితం రూపొందించిన సిలబస్‌నే నేటికీ బోధిస్తున్నారని దీనిని తక్షణం మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఫ్యామిలీ మెడిసిన్, గెరాయాట్రిక్స్, పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్, ఎమర్జన్సీ కేర్ వంటి సబ్జెక్టులతో కూడిన బోధన సాగాలని అపుడే రోగులకు ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొంది. మిగతా చదువుల మాదిరి వైద్య విద్య ఉండకూడదని, పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికపుడు వైద్య విద్య అప్‌డేట్ కావలని, స్కిల్ ట్రైనింగ్ అనేది చాలా కీలకం అవుతుందని పేర్కొంది. ఇందుకోసం ఎంబిబిఎస్ చదువులో గణనీయమైన మార్పులు తీసుకురావాలని కమిటీ పేర్కొంది. జబ్బు రాకుండానే నిరోధించడం, జబ్బు బాధ తగ్గించడం, బాధితుడి పునరావాసం అనే కోణంలో వైద్యం అందించే ప్రక్రియ ప్రస్తుత పరిస్థితుల్లో లేదని అభిప్రాయపడింది. సిలబస్ రూపకల్పనలో , బోధనా పద్థతుల్లో మార్పులు వంటి విషయాలు అమలులోకి తీసుకురావడంలో తీవ్రంగా జాప్యంగా జరిగిందని పేర్కొంది. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఆధునిక వైద్య పద్థతులను అనుసరిచి సిలబస్‌లో మార్పులు చేయాలి, ప్రస్తుత విధానంలో ఎంబిబిఎస్ డాక్టర్‌కు ప్రసవం అంటే ఏమిటో తెలియని పరిస్థితి ఉంది, అది మారాలని పేర్కొంది. ఫైనల్ ఇయర్‌లోకి వచ్చిన విద్యార్ధులు 90 శాతం మంది పిజి సీటు ఎలా సంపాదించాలనే ధ్యాస ఉంటోందే తప్ప వైద్యం మీద అవగాహన ఏ మాత్రం లేదని, ప్రస్తుతం ఉన్న బోధనా పద్ధతులు సైతం ఆధునిక అవసరాలు తీర్చేవిగా లేవని, దేశవ్యాప్తంగా వైద్య విద్య కేంద్రీకృతంగా ఉందే తప్ప గ్రామీణ ప్రాంతాల్లో ఆధునిక వైద్యం అందుబాటులో లేకుండా పోయిందని నివేదిక పేర్కొంది. క్లినికల్ విభాగంతో పాటు పబ్లిక్ హెల్త్‌లో వైద్యులకు ఖచ్చితమైన ఓరియంటేషన్ అవసరం ఉందని, దేశంలో కావల్సిన వైద్య అవసరాలు, దానికి తగ్గట్టు డాక్టర్లను తయారుచేయడంలో ఎంసిఐ పూర్తిగా విఫలమైందని, ఎంబిబిఎస్ చదువు తరగతి గది పాఠాలకే పరిమితం అవుతోందే తప్ప నైతిక విలువలు, రోగి క్షేమం, రోగి సంరక్షణ, సామాజిక కోణం, మానవతా దృక్పథం వంటివి తెలియడం లేదని, ఎంబిబిఎస్ చదవుతోనే ఉన్నత వైద్య సేవలు అందించే పరిస్థితులు కల్పించాలని కూడా సూచించింది.