రాష్ట్రీయం

పోలీసులపై దాడి కుట్ర భగ్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం, డిసెంబర్ 8: విశాఖ ఏజెన్సీలో పోలీసులపై దాడికి ఉద్దేశించిన పేలుడు పదార్థాల తయారీ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. మావోయిస్టులకు ఆయుధ తయారీ సామగ్రి, పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. వాహనంలో తరలిస్తున్న సుమారు 200 ఐరన్ పైప్‌లు, జిలిటెన్ స్టిక్స్, 50 లైవ్ డిటోనేటర్లు, 50 ఖాళీ డిటోనేటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం విశాఖ జిల్లా నర్సీపట్నంలోని ఎఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రూరల్ ఎస్పీ కోయాప్రవీణ్ వివరాలను వెల్లడించారు. జికె వీధి మండల కేంద్రంలో హార్డ్‌వేర్ దుకాణం నిర్వహిస్తున్న షేక్ దావూద్ అనే వ్యక్తి ఏజన్సీలోని మారుమూల ప్రాంతాల్లో కాంట్రాక్ట్ పనులు నిర్వహిస్తుంటాడు. ఇటీవల కాలంలో ముగ్గురు తెలుగుదేశం నాయకులను కిడ్నాప్ చేసిన సందర్భంలో మావోయిస్టు నేతలు జాంబ్రి, ఆజాద్, రవిలు ఇబ్రహీంను కలిసి తమకు అవసరమైన సామగ్రి అందజేయాలని ఆదేశించారు. తీసుకురాకపోతే ఏజెన్సీలో కాంట్రాక్ట్ పనులు చేయనీయబోమని బెదిరించారు. దీంతో దావూద్ ఇబ్రహీం నర్సీపట్నం నుండి వ్యాన్‌లో 200 వరకు ఐరన్ పైప్‌లు, జిలిటెన్ స్టిక్స్, ఇతర మందుగుండు సామగ్రిని తీసుకువెళ్తుండగా మంగళవారం ఉదయం చింతపల్లి మండలం తురబాల గెడ్డ వద్ద పోలీసులు వ్యాన్‌ను తనిఖీ చేయగా సామగ్రిని గుర్తించారు. ఈ పరికరాలతో మావోయిస్టులు డైరెక్షన్ మైన్స్ తయారు చేస్తారన్నారు. కూంబింగ్‌కు వెళ్లే పోలీసులపై దాడి చేసి, భారీ విధ్వంసాలకు పాల్పడేందుకు వీటిని తయారు చేస్తున్నట్టు గుర్తించామన్నారు. గాలికొండ ప్రాంతంలో మావోయిస్టులు ఈ ఆయుధాలను తయారు చేస్తున్నట్లు వెల్లడైందన్నారు. షేక్ దావూద్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని, వీటి రవాణా వెనుక మరికొంత మంది కూడా ఉన్నారన్నారు.

విలేఖరులతో మాట్లాడుతున్న విశాఖ రూరల్ ఎస్సీ
కోయా ప్రవీణ్, స్వాధీనం చేసుకున్న ఆయుధ తయారీ సామగ్రి