రాష్ట్రీయం

పోటీకి టిడిపి, బిజెపి దూరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 23: టిఆర్‌ఎస్ బలం తెలంగాణలో విపక్షాలను ఏకం చేస్తోంది. పలు ఉప ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ సాధించిన విజయాన్ని చూసిన విపక్షాలు బహుముఖ పోటీకన్నా ముఖాముఖి పోటీ ద్వారా టిఆర్‌ఎస్‌కు గట్టిపోటీ ఇవ్వవచ్చునని భావిస్తున్నాయి. కాంగ్రెస్‌ను చీల్చి ఆవిర్భవించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేరుగా పాలేరులో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించగా, టిడిపి, బిజెపిలు పోటీ చేసి డిపాజిట్ కోల్పోవడం కన్నా పోటీకి దూరంగా ఉండడం ద్వారా కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చేందుకు సహకరించాలని నిర్ణయించుకున్నాయి. తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ టిడిపి డిపాజిట్ కోల్పోయింది. చివరకు హైదరాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ టిడిపికి అడ్రస్ లేకుండా పోయింది. చంద్రబాబు, లోకేశ్ విస్తృతంగా ప్రచారం చేసినా టిడిపికి ఒక ఒక సీటు వచ్చింది.
ఇక ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, అచ్చంపేట నగర పంచాయతీలో కనీసం ఒక్క సీటు కూడా రాలేదు. అన్ని ఉప ఎన్నికల్లోనూ టిడిపి డిపాజిట్లు కోల్పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో పాలేరులో పోటీ చేసి మరోసారి డిపాజిట్ కోల్పోవడం కన్నా పోటీకి దూరంగా ఉండాలనే నిర్ణయించుకుంది. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని భట్టి విక్రమార్క టిడిపి తెలంగాణ అధ్యక్షుడు రమణను కోరగా, ఈ అంశంపై రమణ చంద్రబాబుతో మాట్లాడారు. రాష్ట్ర నాయకత్వం చర్చించి సరైన నిర్ణయం తీసుకోవాలని బాబు సలహా ఇచ్చారు. ఖమ్మం జిల్లా టిడిపి నాయకుడు నామా నాగేశ్వరరావు బలమైన అభ్యర్థి అవుతారని జిల్లా టిడిపి నాయకులు తీర్మానిస్తే, నామా నాగేశ్వరరావు మాత్రం కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మరణిస్తే పోటీ చేయడం ఏమిటి? వారి కుటుంబ సభ్యులకు మద్దతు ఇవ్వాలి అని ప్రకటించారు. పాలేరులో బిజెపికి పెద్దగా ఉనికి లేదు. పైగా మిత్రపక్షం టిడిపి పోటీకి దూరంగా ఉంటే తాను పోటీ చేసేంత బలం బిజెపికి లేదు. అలా అని కాంగ్రెస్‌కు నేరుగా మద్దతు ప్రకటించలేదు. దాంతో నియోజకవర్గంలో తమకు బలం లేదు, పోటీకి దూరంగా ఉంటామనే ప్రకటన ద్వారా టిఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ జరిగేట్టు చూడాలనేది బిజెపి ఆలోచన. సిపిఎం మాత్రం తమ పార్టీ జాతీయ నాయకత్వం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటించింది. కాంగ్రెస్ నుంచి పుట్టిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆవిర్భవించిన టిడిపి, జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్న బిజెపి పార్టీలన్నీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఏకం కావడం విశేషం. బహుముఖ పోటీ ద్వారా టిఆర్‌ఎస్‌ను ఎదుర్కోవడం కన్నా విపక్షాల మధ్య ఐక్యత సాధించి ముఖాముఖి పోటీ ద్వారా టిఆర్‌ఎస్‌ను ఎదుర్కోవాలనే ప్రయత్నాలు ఫలిస్తున్నాయి.
టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఖమ్మం జిల్లాలో అనూహ్యంగా పరిస్థితులు మారాయి. తుమ్మల నాగేశ్వరరావుతో పాటు జిల్లా పరిషత్తు చైర్మన్, స్థానిక సంస్థల నాయకులు పెద్ద సంఖ్యలో టిఆర్‌ఎస్‌లో చేరారు. మండలి ఎన్నికల్లోనూ ఖమ్మంలో టిఆర్‌ఎస్ విజయం సాధించింది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ విజయం సాధించింది.
ముఖాముఖి పోటీ వల్ల టిఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్య గట్టి పోటీ జరిగే అవకాశం ఉంది. ఉప ఎన్నికలు అన్నింటిలో ఏకపక్షంగా టిఆర్‌ఎస్ భారీ మెజారిటీతో విజయం సాధించింది. అయితే పాలేరులో టిఆర్‌ఎస్ విజయం సాధించినా ఏకపక్ష విజయం సాధ్యం కాదని విపక్షాలు చెబుతున్నాయి. టిఆర్‌ఎస్ మాత్రం గెలుపుపై ధీమాగా ఉంది. తుమ్మల నాగేశ్వరరావు మంత్రం జిల్లాలో పని చేస్తుందని చెబుతున్నారు.