రాష్ట్రీయం

మెడికల్ పిజీ సీట్ల భర్తీకి ప్రారంభమైన వెబ్ ఆప్షన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 23: రెండు తెలుగు రాష్ట్రాల్లో కన్వీనర్ కోటాలో గల 1905 మెడికల్ పీజీ సీట్ల భర్తీ ప్రక్రియ ఆరంభమైంది. ఈ సారికి డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య శాస్త్ర విశ్వవిద్యాలయం రెండు తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరుగా సీట్లభర్తీ ప్రక్రియను పూర్తి చేయనుంది. ఆంధ్రప్రదేశ్ వరకు దరఖాస్తుల పరిశీలన పూర్తయి శనివారం నుంచి తొలిసారిగా వెబ్ ఆప్షన్‌లు ప్రారంభమయ్యాయి. ఒక్కో అభ్యర్థి కనీసం 150 ఆప్షన్‌లు వరకు ఇచ్చుకునే అవకాశం లభించింది. ఇంటి నుంచే ఈ ఆప్షన్స్ ఇచ్చుకునే అవకాశం ఉన్నప్పటికీ విశ్వవిద్యాలయం తరపున ఆంధ్రలో ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ, తిరుపతిలోని ఎస్‌వి విశ్వవిద్యాలయంలో ఓల్డ్ ఎంబిఎ భవన్, విశాఖలో ఆంధ్ర విశ్వవిద్యాలయం, అలాగే తెలంగాణలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ వర్శిటీ క్యాంపస్, కుకట్‌పల్లిలోని జెఎన్‌టియు క్యాంపస్, వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలోనూ హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశారు. తెలంగాణలో ఆదివారం నుంచి సర్ట్ఫికెట్ల పరిశీలన జరుగనున్నది. వెబ్ ఆప్షన్‌లో సీటు సాధించి ఆ తర్వాత వద్దనుకుంటే ఆ తరువాతి వారికి ఆ సీటు కేటాయించనున్నారు. ఎయు పరిధిలో ప్రభుత్వ కళాశాలలో 396 సీట్లు, ప్రైవేటు కళాశాలలో కన్వీనర్ కోటాలో 276 సీట్లు ఉంటే నాన్ సర్వీస్ వారికి 430, సర్వీస్‌లోనున్న వారికి 232 సీట్లు కేటాయించారు. అదే వరుసలో ఎస్‌వియులో 235, 119, 227, 127 సీట్లు, ఉస్మానియా పరిధిలో 530, 298, 533, 298 సీట్లు ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్టేట్ వైడ్ కళాశాల విజయవాడలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో 61 పిజి సీట్లు ఉన్నాయి.