ఆంధ్రప్రదేశ్‌

సెక్రటేరియట్ ప్రారంభం నేడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 24: నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వెలగపూడి సమీపంలో 42.90 ఎకరాలలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం సోమవారం ప్రారంభమవుతోంది. జూన్ నాటికి హైదరాబాద్‌నుంచి సచివాలయ ఉద్యోగులందరినీ తరలించాలన్న కృతనిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉండడంతో యుద్ధ ప్రాతిపదికపై పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేస్తున్నారు. తొలుత అంచనా వ్యయం రూ.180 కోట్లు కాగా క్రమేణా పెరుగుతూ నిన్న మొన్నటికి రూ.500 కోట్లకు చేరుకుంది. ఇందులో 50 శాతం అంటే రూ.250 కోట్లను ప్రభుత్వం భరిస్తూ మిగిలిన సొమ్మును 10 శాతం వడ్డీపై హడ్కో నుంచి రుణంగా తీసుకుంది. తాజాగా మరో రెండు అంతస్తులను నిర్మించాలని ప్రభుత్వం భావించడంతో అంచనా వ్యయం 900 కోట్లకు చేరింది. ఏది ఏమైనా తొలుత భావించినట్లుగా జి ప్లస్ 1 భవనాల నిర్మాణం సరిగ్గా 100 రోజుల్లో పూర్తికావటం రికార్డే. మే, జూన్ మాసాల్లో సరైన ముహూర్తాలు లేవు. మరోవైపు జూన్ మాసాంతానికి హైదరాబాద్‌లో ఉన్న ఉద్యోగులందరిని తరలించాలని భావించడంతో హడావుడిగా మొదటి అంతస్తులోని రెండు గదులను ఈ నెల 25న తెల్లవారుజామున 4.01 నిమిషాలకు శాస్త్రోక్తంగా ప్రారంభించాలని నిర్ణయించడంతో ఆగమేఘాలపై పనులు జరుగుతున్నాయి. అసలు తాత్కాలిక సచివాలయ నిర్మాణం కోసం సిఆర్‌డిఎ రూ.180 కోట్ల అంచనా వ్యయంతో 15న టెండర్లు పిలువగా షాపూర్జీ అండ్ పల్లాంజీ, ఎల్ అండ్ టి కంపెనీలు రూ.203 కోట్లకు టెండర్లు దాఖలు చేశాయి. ఒక బ్లాక్‌ను షాపూర్జీ కంపెనీకి, 4 భవనాలతో కూడిన రెండు బ్లాక్‌ల పనులను ఎల్ అండ్ టికి అప్పగించారు. ఇందులో షాపూర్జీ కంపెనీ చేపట్టిన బ్లాక్ ప్రధానమైంది. అందులోనే ముఖ్యమంత్రి కార్యాలయం ఏర్పాటవుతోంది. ఇతర భవనాల్లో సచివాలయం, శాసనసభ, శాసనమండలి ఏర్పాటవుతాయి.
తొలుత తాత్కాలిక సచివాలయాన్ని మంత్రులు, వారి కార్యదర్శులు, సచివాలయం కార్యదర్శులకే పరిమితం చేయాలనుకున్న సిఎం ఆ తర్వాత విజయవాడ, గుంటూరు నగరాల్లో ఏర్పాటు చేయదలచిన హెచ్‌వోడి కార్యాలయాలను కూడా ఒకే గూటికి చేర్చేందుకు మరో రెండు అంతస్తుల నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం ఆగస్టు నాటికి మొత్తం పది వేలమందిని ఈ తాత్కాలిక సచివాలయానికి తరలించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏది ఏమైనా గత ఫిబ్రవరి 17న ఈ తాత్కాలిక సచివాలయం భవనాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయగా ఆ రెండు కంపెనీలు తమకున్న అనుభవాలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి సరిగ్గా వంద రోజుల్లో మొదటి అంతస్తుకు శ్లాబ్ కూడా పూర్తి చేయగలిగాయి. ఇందుకోసం 1500 మంది కూలీలు రాత్రింబవళ్లు శ్రమించారు. ఈనెల 18న కేవలం 11 గంటల వ్యవధిలో 10వేల చదరపు అడుగుల నిర్మాణానికి శ్లాబ్ వేసి రికార్డు సృష్టించారు. ప్రతి బ్లాక్ లోను 8 లిఫ్ట్‌లు చొప్పున 24 లిఫ్టులను ఏర్పాటు చేస్తున్నారు. సిఆర్‌డిఎ కన్సల్టెన్సీక్రీజా సంస్థ ఇంటీరియర్ డిజైన్‌కు డ్రాయింగ్‌లను సిద్ధం చేసింది.

చిత్రం... ప్రారంభోత్సవానికి ముస్తాబు