రాష్ట్రీయం

మార్చి నాటికి పట్టిసం ఎత్తిపోతల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం/పోలవరం, డిసెంబర్ 8: గోదావరి, కృష్ణా నదుల అనుసంధానానికి మూలమైన పట్టిసం ఎత్తిపోతల పథకం స్ఫూర్తితో రాష్ట్రంలో కృష్ణా-పెన్నా, నాగావళి-వంశధార నదులను అనుసంధానిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి నదిపై జరుగుతున్న పట్టిసం ఎత్తిపోతల పథకం పనులను ముఖ్యమంత్రి మంగళవారం పరిశీలించారు. ఈసందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. రూ.1200 కోట్ల ఖర్చుతో ఐదున్నర నెలల్లోనే గోదావరి, కృష్ణా నదులను అనుసంధానించగలిగామని, దేశంలో ఇదే ప్రప్రథమ నదుల అనుసంధానన్నారు. గోదావరి జలాల తరలింపు ద్వారా కృష్ణా డెల్టాలో రూ.2400 కోట్ల విలువైన పంటలను కాపాడగలిగామన్నారు. ఇదే స్ఫూర్తితో పట్టిసం ఎత్తిపోతల పథకాన్ని 2016 మార్చి 29వ తేదీనాటికి పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రస్తుతానికి 350 క్యూసెక్కుల సామర్థ్యం గల ఐదు పంపులు పని చేస్తున్నాయని, గోదావరి నది నుండి 1,750 క్యూసెక్కుల నీటిని తోడుతున్నట్టు వివరించారు. పథకం మొత్తం పూర్తయితే 24 పంపులు, 24 మోటార్లు పనిచేయడం ద్వారా 8500 క్యూసెక్కుల నీటికి తరలించే అవకాశముందన్నారు. ఈ ప్రాజెక్టులో 200 మంది ఇంజనీర్లు, 300 మంది సాంకేతిక సిబ్బంది, 700 మంది ఇతర సిబ్బంది రేయింబవళ్ళు పని చేశారని, వారి కృషివల్లే అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగామన్నారు. అలాగే ఈ పథకానికి అవసరమైన 125 ఎకరాల భూసేకరణకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో రైతులను ఒప్పించారన్నారు. భూసేకరణకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే 74 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన 26 శాతం పనులు మూడు నెలల్లో పూర్తిచేసి, శంకుస్థాపన చేసిన ఏడాదిలో పూర్తిచేసిన ఘనత దక్కించుకోవాలన్నారు. గతంలో తన తొమ్మిదేళ్ల పాలనలో హైదరాబాద్‌ను ప్రపంచ నగరాల స్థాయికి చేర్చగలిగానని, ఇప్పుడు పట్టిసం ఎత్తిపోతల పూర్తిచేస్తే అంతకంటే ఎక్కువ సంతృప్తి కలిగిందన్నారు. ఈ ప్రాజెక్టు వస్తే గోదావరి డెల్టా దెబ్బతింటుందని ఉభయగోదావరి జిల్లాల రైతులను కొంత మంది పనిగట్టుకుని రెచ్చగొట్టారని, అయినప్పటికీ అర్థం చేసుకుని సహకరించారన్నారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండే 90 రోజుల్లోనే కృష్ణానదికి నీటిని తరలిస్తామని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. విద్యుత్తు ఏవిధంగా అయితే ఒక చోట ఉత్పత్తిచేసి, మిగిలిన వినియోగ ప్రాంతాలకు సరఫరా అవుతుంతో నీరు కూడా అదేవిధంగా వ్యవసాయానికి, పరిశ్రమలకు, తాగడానికి ఉపయోగపడేలా ‘స్మార్ట్ వాటర్ గ్రిడ్’లు తయారుచేయనున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలో నీటి ఎద్దడి లేకుండా చేయడమే ఈ గ్రిడ్‌ల లక్ష్యమన్నారు. కోస్తాలో నదులు ఉన్నాయని, రాయలసీమలో బంగారం పండే భూములున్నాయని, దేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదయ్యే అనంతపురం జిల్లాకు నీరు ఇవ్వగలిగితే బ్రహ్మాండమైన పంటలు పండుతాయన్నారు. నీరుంటేనే అభివృద్ధి, సంపద ఉంటుందని, అందుకే వర్షపు నీటిని సైతం ఉపయోగించుకోవడానికి నీరు-ప్రగతిపై చర్చ చేపట్టామన్నారు. వర్షపు నీటిని వినియోగించుకునే చిన్న చిన్న వనరులు, చెక్‌డ్యామ్‌లు, పూడికతీత పనులకు ఉపాధి హామీ పథకం కూలీ చెల్లిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న హంద్రీనీవా, గాలేరు నగరి, తోటపల్లి, వంశధార, వెలుగొండ ప్రాజెక్ట్‌లు కూడా పూర్తి చేస్తామని ఈసందర్భంగా ముఖ్యమంత్రి ప్రకటించారు.
అంతకుముందు పోలవరం మండలం ఇటికిలకోట వద్ద గోదావరి జలాలు పోలవరం కుడి ప్రధాన కాలువలో కలిసే ప్రాంతంలో ముఖ్యమంత్రి హారతులిచ్చి పూజలు చేశారు. కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పీతల సుజాత, ఎంపిలు, ఎమ్మెల్యేలు, అధికార్లు పాల్గొన్నారు.

పట్టిసం మోటారు పనిచేస్తున్న బావిన
పరిశీలించడానికి వెళుతున్న ముఖ్యమంత్రి