రాష్ట్రీయం

ఐదు రోజులే పనిదినాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 25: పరిపాలనాపరమైన వ్యయం తగ్గించడానికి, ప్రజలకు మేలైన పరిపాలనను అమరావతి నుంచే అందించడానికి కేవలం 62 రోజుల్లోనే ప్రభుత్వ భవనాల తొలిదశను పూర్తిచేయగలిగానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. సోమవారం తెల్లవారుఝామున 4.01 గంటలకు ముఖ్యమంత్రి సచివాలయ తాత్కాలిక భవనాలను ప్రారంభించారు. మంత్రివర్గ సహచరులు, ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు. ఉద్యోగులు పడుతున్న కష్టాలు తనకు తెలుసన్న సిఎం, వారికి ప్రత్యేకంగా 30 శాతం ఇంటి అద్దె అలవెన్సుతోపాటు వారానికి ఐదు రోజుల పనిదినాలు కల్పిస్తున్నట్టు ప్రకటించారు. దీనికి అక్కడ ఉన్న ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. వాస్తవానికి హైదరాబాద్‌లో స్థిరపడిన వారు ఇక్కడికి రావడం బాధగానే ఉంటుందని, అలాంటి బాధ తనకూ లేకపోలేదన్నారు. జూన్ మాసాంతానికి 4వేల మంది, జూలై మాసాంతానికి 3వేల మంది, ఆగస్టు మాసాంతానికి మిగిలిన 3వేల మంది ఉద్యోగులు తరలిరావలసి ఉందన్నారు. చట్టప్రకారం హైదరాబాద్‌ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా వినియోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ తనపై ఎంతో నమ్మకం, విశ్వాసంతో అధికారం అప్పగించిన 5 కోట్ల మంది ప్రజలకు సరైన మార్గదర్శకత్వం వహించాలనే తపనతో పరిపాలనను ఇక్కడి నుంచే చేపట్టాలని భావించానన్నారు. సరైన వనరులు, వసతులు లేకుండానే తన పాలన ఏవిధంగా ఆరంభమైందో గుర్తుచేస్తూ కూర్చొని పనిచేసేందుకు సరైన కార్యాలయ వసతి లేకపోయినా బస్సులోనే బసచేసి నెమ్మదిగా విజయవాడలో కార్యాలయం నిర్మించుకున్నామన్నారు. సమీక్షల కోసం ఉన్నతాధికారులు హైదరాబాద్ నుంచి రావడం, తిరిగి వెళ్లడం తనకెంతో బాధకలిగించిందనీ, ప్రభుత్వానికి ఖర్చులు కూడా ఎక్కువగా అవుతున్నాయని తెలిపారు. తాత్కాలికంగా గృహ సమస్య ఉందని, అందుకే ఏడాది కాలంలోనే ప్రభుత్వపరంగా 5 వేల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నామన్నారు.

చిత్రం ముఖ్యమంత్రి చంద్రబాబుకు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలుపుతున్న ఏపిఎన్‌జిఓల నేత అశోక్‌బాబు తదితరులు