రాష్ట్రీయం

ఉచిత వివాహాలు జరిపించిన టిటిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, ఏప్రిల్ 25 : టిటిడి కల్యాణం పేరుతో మరో బృహత్తర కార్యక్రమాన్ని సోమవారం శ్రీకారం చుట్టింది. కల్యాణం పేరుతో వధూవరులకు ఉచిత వివాహాలను చేయాలని సంకల్పించింది. టిటిడి ఇవో సాంబశివరావు ఈ పథకాన్ని సోమవారం పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకువచ్చారు. వాస్తవానికి ఈ నెల 20 నుంచే ఉచిత వివాహాలు జరిపించాలని టిటిడి నిర్ణయించినప్పటికీ వివాహ ముహూర్తాలు లేని కారణంగా సోమవారం నుంచి తిరుమల్లోని కల్యాణ వేదికలో ఉచిత వివాహాలు నిర్వహించారు. తొలిరోజున ఈ పథకం కింద 42 జంటలకు వివాహాలను జరిపించింది. జంటలకు పౌరోహితుడు, మేళం, విద్యుత్ చార్జీలకు ఎటువంటి రుసుము వసూలు చేయకుండానే వివాహం జరిపించారు. అంతేకాకుండా దంపతులతో కలిపి ఆరుగురికి శ్రీవారి దర్శనం, 10 చిన్న లడ్డూలు, రూ.50 గదిని టిటిడి ఉచితంగా అందించింది. నూతనంగా ప్రవేశపెట్టిన కల్యాణ పథకానికి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. శ్రీవారి సన్నిధి చెంత ఒక్కటవడమే భాగ్యంగా బావించే భక్తులకు టిటిడి ఉచితంగా వివాహాలు జరిపించడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

శ్రీవారి హుండీ వద్ద భక్తురాలి సొమ్ము చోరీ
తిరుమల, ఏప్రిల్ 25: టిటిడి, పోలీసు శాఖ ఎన్ని రకాల భద్రతా చర్యలు చేపడుతున్నా శ్రీవారి ఆలయంలో భక్తులు తరచూ తమ సొమ్ము తస్కరణకు గురౌతోంది. ఈక్రమంలోనే శ్రీవారి ఆలయంలో భక్తులు కానుకలు సమర్పించే శ్రీవారి హుండీ వద్ద ఓ భక్తురాలు హ్యాండ్ బ్యాగులో ఉన్న లక్ష రూపాయలు సొమ్మును గుర్తు తెలియని యువతి శనివారం చోరీ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. చీరాలకు చెందిన సుధీర్ అనే భక్తుడు తన కుటుంబసభ్యులతో కలసి ఈ నెల 23న స్వామివారి దర్శనానికి వచ్చాడు. స్వామివారి దర్శనానంతరం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ముడుపులు సమర్పించేందుకు శ్రీవారి హుండీ వద్దకు వెళ్లారు. అదే సమయంలో ఓ యువతి వారి వెనుకగా హుండీలో డబ్బు వేయడానికి అన్నట్లుగా వెంట నడిచింది. సుధీర్ బార్య తన బ్యాగ్‌ను తెరచి తాను మొక్కుకున్న సొమ్మును హుండీలో సమర్పించింది. ఆ తరువాత తెరచిన బ్యాగ్ జిప్ వేయడం మరచింది. అదే అదునుగా భావించిన మహిళ తన చేతి వాటాన్ని ప్రదర్శించి లక్ష రూపాయలు చోరీచేసింది.