రాష్ట్రీయం

రేపే ఎంసెట్ పటిష్ఠమైన ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఏప్రిల్ 27: ఎపి ఎంసెట్-2016ను ఈనెల 29న హైదరాబాద్‌తో పాటుగా ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలో నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. జెఎన్‌టియుకె పర్యవేక్షణలో ఈ ప్రవేశ పరీక్షల నిర్వహణకు పటిష్ఠమైన ఏర్పాట్లుచేశారు. ఎంసెట్‌కు తెలుగు రాష్ట్రాల నుండి సుమారు 3 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఎంసెట్ నిర్వహణకు 378 మంది పరిశీలకులు, 123 ప్రత్యేక పరిశీలకులను నియమించారు. 150 మంది ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సహా రెవెన్యూ అధికారులను కూడా పరీక్షల ప్రత్యేకాధికారులుగా నియమించారు. శుక్రవారం ఉదయం 10నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఇంజనీరింగ్, మధ్యాహ్నం 2.30నుండి సాయంత్రం 5.30 గంటల వరకు అగ్రికల్చర్, మెడిసిన్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష రోజు సాయంత్రం ప్రిలిమినరీ కీ విడుదలచేస్తారు. మే 9న ఇంటర్మీడియెట్ వెయిటేజీతో సహా ర్యాంక్‌లు విడుదలచేసి,27న అడ్మిషన్స్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. సర్ట్ఫికెట్స్ వెరిఫికేషన్‌ను జూన్ 6న నిర్వహించి, జూన్ 9నుండి 18వ తేదీ వరకు ఆప్షన్ల కేటాయింపునకు అవకాశం కల్పించారు. జూన్ 22నుండి సీట్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభించి, 27 నుండి తరగతులు ప్రారంభిస్తారు. కాగా ఎంసెట్ రోజు ఉదయం 5.45 గంటలకు కాకినాడ జెఎన్‌టియుకెలో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంజనీరింగ్ పరీక్షకు సంబంధించి సెట్ కోడ్‌ను విడుదల చేస్తారు. ఉదయం 9 గంటలకు మెడిసిన్, అగ్రికల్చర్ పరీక్షలకు సంబంధించి సెట్ కోడ్‌ను వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ విడుదల చేస్తారు.

పరీక్షా కేంద్రాల్లో జామర్లు
అన్ని పరీక్షా కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య పరీక్షల నిర్వహణకు రంగం సిద్ధం చేసినట్టు ఎపి ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ సిహెచ్ సాయిబాబు చెప్పారు. గతంలో ఎంసెట్ నిర్వహణపై వచ్చిన ఆరోపణలు, అవకతవకలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 22, హైదరాబాద్‌లో 2 సెంటర్లు మొత్తం 24 రీజనల్ సెంటర్ల పరిధిలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నామన్నారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ప్రతి కేంద్రంలో అవకతవకలకు ఆస్కారం లేకుండా జామర్లు ఏర్పాటుచేస్తామన్నారు. పరీక్షా కేంద్రాల్లోకి ఏ విధమైన కంప్యూటర్ చిప్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు, స్మార్ట్ వాచ్‌లు, కాలిక్యులేటర్లు, స్మార్ట్ఫోన్‌లను అనుమతించేది లేదన్నారు. పరీక్ష రాసిన అనంతరం తమ ప్రశ్నాపత్రాన్ని విద్యార్థులు బయటకు తీసుకువెళ్ళవచ్చని చెప్పారు. ఎంసెట్‌పై సందేహాల నివృత్తికి 18004256755 టోల్‌ఫ్రీ నెంబర్‌కు సంప్రదించవచ్చని విద్యార్థులు, తల్లిదండ్రులకు డాక్టర్ సాయిబాబు సూచించారు.