రాష్ట్రీయం

అవినీతి కుబేరుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ/ఏలూరు, ఏప్రిల్ 28: ఉభయ గోదావరి జిల్లా ల్లో ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన ఇద్దరు అధికారులు అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) తనిఖీల్లో దొరికిపోయారు. వీరిద్దరూ కోట్ల రూపాయల విలువైన ఆస్తులు, ఆభరణాలతో అపర కుబేరులుగా వెలిగిపోతున్నట్టు గురువారం జరిపిన తనిఖీల్లో వెల్లడయ్యింది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ (డిటిసి) సుమారు రూ.100 కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టగా, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్సిపాల్టీలో డిఇగా పనిచేస్తున్న అధికారి సుమారు రూ.10 కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టారు. కాకినాడలో ఉప రవాణా కమిషనర్ (డిటిసి)గా పనిచేస్తున్న ఆదిమూలం మోహన్ భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్టు సమాచారం అందడటంతో ఎసిబి డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎం మాలకొండయ్య ఆదేశాల మేరకు సెంట్రల్ ఇనె్వస్టిగేషన్ యూనిట్ డిఎస్‌పి ఎ రమాదేవి ఆధ్వర్యంలో గురువారం సోదాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మొత్తం తొమ్మిదిచోట్ల ఎసిబి బృందాలు ఏకకాలంలో సోదాలు జరిపాయి. కాకినాడలో మోహన్ నివసిస్తున్న ఇంట్లో హైదరాబాద్ ఎసిబి సెంట్రల్ ఇనె్వస్టిగేషన్ యూనిట్ సోదాలు జరిపింది. ఆ సమయంలో మోహన్ ఇంట్లోనే ఉన్నారు. అలాగే విజయవాడతోపాటు, అనంతపురం, కడప, మెదక్, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో, కర్ణాటకలోని బళ్లారిలోని మోహన్ బంధువుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు రూ.100 కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించారు. హైదరాబాద్‌లోని కొంపల్లె, మాదాపూర్, బేగంపేట, జూబ్లీహిల్స్, పంజాగుట్టలో కోట్లాది రూపాయల విలువైన భవనాలు, అపార్ట్‌మెంట్స్‌లో ఫ్లాట్లు, ఇళ్ల స్థలాలు ఉన్నట్టు సోదాల్లో గుర్తించారు. మాదాపూర్‌లో 4 ఫ్లాట్లు, జూబ్లీహిల్స్‌లో 400 చదరపు గజాల స్థలం, 3 అంతస్తుల భవనం, పంజాగుట్టలో 8 ప్లాట్లు ఉన్నట్టు గుర్తించారు. మూడు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో సుమారు 45 ఎకరాల భూమి ఉన్నట్టు గుర్తించారు. అలాగే కాకినాడ నగరంలోని మోహన్ నివాసంలో భారీగా వజ్రాలు, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు బయటపడ్డాయి. వీటి విలువ కూడా కోట్లలో ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఆస్తులకు సంబంధించి కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వెలుగుచూసిన ఆస్తుల్లో అనేకం మోహన్ కూతురు, అల్లుడు, ఇతర బంధువుల పేర్లపై ఉన్నట్టు తెలుస్తోంది. స్థానిక ఆర్‌టిఒ కార్యాలయంలో కూడా అధికారులు తనిఖీ చేశారు.
కాగా ఎసిబి సెంట్రల్ ఇనె్వస్టిగేషన్ డిఎస్‌పి రమాదేవి మాట్లాడుతూ ఆదాయానికి మించి ఆస్తులు కలిగివున్నట్టు వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ సోదాలు జరిపినట్టు చెప్పారు. డిటిసి మోహన్ నివసిస్తున్న కాకినాడలోని ఇంట్లో జరిపిన సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. కాగా ఈ దాడులపై మాట్లాడటానికి డిటిసి మోహన్ నిరాకరించారు.
డిఇ ఆస్తులు రూ. 10 కోట్లు
ఇక పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో డిఇగా పనిచేస్తున్న వంగపండు సత్యనారాయణ ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్టు ఎసిబి అధికారులు గుర్తించారు. ఎసిబి డిఎస్‌పి కె రాజేంద్ర తెలిపిన వివరాల ప్రకారం ఏలూరులో అయిదుచోట్ల, కృష్ణాజిల్లా గుడివాడలో రెండుచోట్ల సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలూరులోని గులాబీతోటలో 240 గజాల ప్లాటు, ఆర్‌ఆర్ పేటలో రెండు ఫ్లాట్లు, పెదపాడు మండలం కొత్తూరులో ఏడెకరాల పొలం, కొత్తూరు ఎస్‌బిఐలో రూ.12 లక్షల ఫిక్సిడ్ డిపాజిట్, ఏలూరు ఆంధ్రాబ్యాంకులో సుమారుగా అరకేజీ నుంచి కేజీ బంగారం ఉండవచ్చునని భావిస్తున్న ఒక లాకరు ఉన్నట్లు గుర్తించారు. అలాగే సత్యనారాయణ బంధువు, గుడివాడలో నివాసముంటున్న మూడెడ్ల వెంకటలక్ష్మి, ఆమె భర్త సూర్యనారాయణ ఈయనకు బినామీలుగా వ్యవహరిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. వీరితోపాటు ప్రస్తుతం ఇక్కడ వర్క్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న కె సత్యనారాయణ కూడా బినామీగా వ్యవహరిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ఆస్తులతోపాటు సత్యనారాయణ కుమారుడు ఎస్‌ఆర్‌ఎం కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఐబిఎంలో మేనేజ్‌మెంట్ కోర్సును పూర్తిచేశారు. దాని నిమిత్తం రూ.12 లక్షలు, కుమార్తె ఇంజనీరింగ్ చదువుకు రూ.30 లక్షల మేర డొనేషన్లు చెల్లించినట్లు గుర్తించారు. సత్యనారాయణను అరెస్టు చేసినట్లు డిఎస్‌పి తెలిపారు.

chitram కాకినాడ డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ (డిటిసి) మోహన్