తెలంగాణ

జాతీయ రహదారిపై దారి దోపిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, డిసెంబర్ 8: సినిమా ఫక్కీలో 65వ నంబరు జాతీయ రహదారిపై భారీ మొత్తంలో దారిదోపిడీ చోటు చేసుకుంది.
ఈ ఘటనలో రూ.50 లక్షలు గుర్తు తెలియని దుండగులు కారు ప్రయా ణికుల నుంచి లూటీ చేశారు. సంగారెడ్డి రూరల్ ఎస్‌ఐ-1 శివలింగం కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మహారాష్టల్రోని బీడ్ జిల్లాకు చెందిన ఇసాక్ సదాశివపేట, సంగారెడ్డి, మునిపల్లి తదితర ప్రాంతాల్లో రైతుల నుంచి పత్తిని సేకరించి గుజరాత్‌లోని ఓ వ్యాపారికి తరలిస్తుంటారు. కమిషన్ పద్ధతిన వ్యాపారం సాగిస్తున్న ఇసాక్ సోమవారం తన స్నేహితులైన గఫార్, నిసార్‌తో పాటు కారు డ్రైవర్ అస్వాక్‌తో హైదరాబాద్‌కు వెళ్లారు. సికింద్రాబాద్‌లోని వ్యాపారి కార్యాలయానికి వెళ్లిన వీరు రూ.67.80 లక్షలను బ్యాగుల్లో పెట్టుకుని స్కోడా కారులో తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో టీ తాగిన అనంతరం బయలుదేరగా సంగారెడ్డి మండలంలోని కవలంపేట, గణేష్‌గడ్డల మధ్యలోకి రాగానే ఇండికా కారులో వచ్చిన దుండగులు స్కోడా కారుకు అడ్డం గా నిలిపారు. స్కోడా కారు డ్రైవర్ అస్వాక్ వద్దకు వస్తూనే కళ్లలో కారం చల్లారు. మిగిలిన వ్యక్తులకు కూడా కారం చల్లి రూ.50 లక్షలు ఉన్న బ్యాగును తీసుకుని పరారయ్యారు. ఈ ఘటన రాత్రి 8 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. బాధితులు తేరుకుని సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌కు చేరుకునే సరికి రాత్రి 10 గంటలు దాటింది. ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ బి.సుమతి సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అన్ని ప్రధాన రహదారులపై వాహనాల తనిఖీ ముమ్మరం చేసారు. కాగా ఈ ఘటనలో కొంత మిస్టరీ ఉన్నట్లు అనుమానించిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే కొంత కీలకమైన సమాచారాన్ని సేకరించి మిస్టరీని త్వరలోనే చేధించే దిశలో పరిశోదన చేస్తున్నారు. సంగారెడ్డి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.