రాష్ట్రీయం

మనీ సర్క్యులేషన్ చేస్తే ఆమ్వేపై చర్యలు తీసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 28: ఆమ్వేఇండియా సంస్ధ మనీ సర్క్యూలేషన్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు గురువారం ఆంధ్ర, తెలంగాణ పోలీసులను ఆదేశించింది. ఆమ్వే సంస్థ కార్యకలాపాలను రాష్ట్రంలో అరికట్టాలని కోరుతూ విజయవాడకు చెందిన కార్పోరేట్ ఫ్రాడ్స్ వాచ్ సొసైటీ ప్రతినిధి ఎంవి శ్యాంసుందర్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. ఈ పిటిషన్‌ను మూసివేస్తూ ఆమ్వే ఇండియా సంస్ధ అక్రమంగా మనీ సర్క్యూలేషన్ కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకోవాలని ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.