రాష్ట్రీయం

ఇంకుడు గుంతలు లేకుంటే కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 28: గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థలో ఇంకుడు గుంతలు నిర్మాణం చేయకుండా నిర్మించిన భవన యాజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ హైకోర్టు జిహెచ్‌ఎంసి, తెలంగాణ రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇంకుడు గుంతలు కట్టని భవనాలకు మంచినీటి కనెక్షన్లను తొలగించాలని ఆదేశించింది. ఎస్ వైదేహి రెడ్డి అనే ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది. 2009 జూన్ 9వ తేదీన జారీ చేసిన జీవో ఎంఎస్ 350ను అమలు చేసే విధంగా జిహెచ్‌ఎంసికి ఆదేశాలు ఇవ్వాలని ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోంస్లే, జస్టిస్ పి నవీన్ రావుతో కూడిన ధర్మాసనం విచారించింది. నగరంలో భవనాలు, ఇండిపెండెంట్ ఇండ్లు, వాణిజ్య భవనాలను తనిఖీ చేయాలని మున్సిపల్ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఇంకుడు గుంతలు నిర్మించని భవన యాజమానులకు నిర్ణీత గడువు ఇవ్వాలని పేర్కొంది. ఆ గడువులోపల ఇంకుడు గుంతలు నిర్మించకపోతే చర్యలు తీసుకోవాలన్నారు. మంచినీటి కనెక్షన్‌ను తొలగించాలంది. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఉన్నాయా లేదా, వాటిని ఎలా నిర్మించారనే విషయమై కూడా తనిఖీలు చేయాలని హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వం ఈ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఒక కమిటీని నియమించాలన్నారు. పిటిషనర్ తరఫున న్యాయవాది డి ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపిస్తూ చాలా భవనాల్లో ఇంకుడు గుంతలు లేవన్నారు. జిహెచ్‌ఎంసి తరఫున న్యాయవాది కేశవరావు వాదనలు వినిపిస్తూ జీవో అమలుకు జిహెచ్‌ఎంసి చిత్తశుద్ధిగా కృషి చేస్తోందన్నారు. అనంతరం ఈ కేసు విచారణను జూన్ 20వ తేదీకి వాయిదా వేశారు.