రాష్ట్రీయం

రూ.269 కోట్లతో కాజీపేటలో పిఓహెచ్ వర్క్‌షాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఏప్రిల్ 28: దశాబ్దాలుగా కోచ్ ఫ్యాక్టరీకోసం ఎదురు చూస్తున్న కాజీపేటకు మొత్తంమీద ఏదో ఒక యూనిట్‌ను కేటాయంచేందుకు సన్నద్ధత వ్యక్తం చేసింది. కోచ్ ఫ్యాక్టరీ స్థనంలో పిరియాడికల్ ఓవర్ హాలింగ్ (పిఓహెచ్) వర్క్‌షాపును ఏర్పాటు చేసేందుకు రైల్వేశాఖ ఆయమోదముద్ర వేసింది. 269 కోట్లతో ఈ వర్క్ షాప్‌ను ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం ఈ ఏడాది బడ్జెట్‌లో (2016-17) రూ. 20కోట్లు కేటాయంచారు. కాజీపేటకు రైల్వేపరంగా పెద్ద పెద్ద ప్రాజెక్టులు మంజూరు అవుతున్నా వివిధ కారణాల వల్ల ఏ ఒక్కటి కూడా నిర్మాణం కాలేకుండానే ఇతర ప్రాంతాలకు తరలిపోయాయి. పాతికేళ్ల కిందటే కాజీపేటకు మంజూరైన అతిపెద్ద కోచ్ ఫ్యాక్టరీ పంజాబ్‌కు తరలివెళ్లింది. అప్పట్లో అప్పటి ప్రభుత్వాలు నక్సల్స్ బూచి చూపి కోచ్ ఫ్యాక్టరీని పంజాబ్‌కు తరలించారు. ఆ తరువాత కాజీపేటకు మరో అతిపెద్ద ప్రాజెక్టు అయిన వ్యాగన్ వర్క్‌షాపు కూడా మంజూరైంది.
అందుకోసం స్థల సేకరణ పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ జిల్లా మడికొండ మెట్టురామలింగేశ్వర ఆలయానికి చెందిన 54 ఎకరాల భూమిని కూడా కేటాయించినప్పటికీ రైల్వే శాఖ మాత్రం ఉన్న ఫలంగా కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఉపసంహరించుకుంది. తాజాగా మంజూరు చేసిన పిఓహెచ్ నిర్మాణాల కోసం రైల్వే జిఎం రవిందర్‌గుప్తా పిఓహెచ్ వర్క్‌షాపు నిర్మాణం కోసం 150 ఎకరాల స్థలాన్ని ఇవ్వాలంటూ ఇటీవలే ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రాజీవ్‌శర్మకు లేఖ రాశారు. అందుకు ప్రభుత్వం కూడా సానుకూలత వ్యక్తం చేసింది. కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం చేయవలసిన స్థలంలోనే మరో 100 ఎకరాలు సేకరించి మడికొండ వద్దే పిఓహెచ్ వర్క్‌షాపును నెలకొల్పేందుకు చకాచకా పావులుకదుపుతున్నారు. స్థలాన్ని రైల్వేకు ఇచ్చేందుకు కలెక్టర్ వాకాటి కరుణ కూడా అంగీకరించారు. పిఓహెచ్ వర్క్‌షాపు కాజీపేటలో నెలకొల్పినట్లయితే ప్రత్యక్షంగా 2వేల మందికి ఉద్యోగ అవకాశాలు దొరకడమే కాకుండా పరోక్షంగా మరో 3వేల మందికి ఉపాధి అవకాశాలు దొరకనున్నాయి. పిఓహెచ్ వర్క్‌షాపు అయిన కాజీపేటలో నెలకొల్పేనా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గతంలో అనేక ఫ్యాక్టరీలు రైల్వేపరంగా మంజూరైనా అప్పటి ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల అవి ఇతర ప్రాంతాలకు తరలివెళ్లాయి. అయితే వరంగల్‌కు చెందిన ఇద్దరు పార్లమెంటు సభ్యులు కూడా ఈ విషయంలో చొరవ తీసుకోవడంతో ఈ సారి కాజీపేటలో పిఓహెచ్ నెలకొల్పడం ఖాయంగా కనిపిస్తుంది. త్వరలోనే పనులు కూడా ప్రారంభమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరోవైపు రాష్ట్ర విభజన చట్టంలో పొందుపర్చిన విధంగా కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ కూడా రావలసిన అవసరం ఉంది. ఈ విషయంలో మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు సీతారాంనాయక్, వరంగల్ పార్లమెంటు సభ్యుడు పసునూరి దయాకర్ ఇటీవలే రైల్వే మంత్రిని కలిసినట్లు వారు తెలిపారు. సాధ్యమైనంత వరకు త్వరలోనే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని కూడా తమవంతు కృషి చేస్తామని ఎంపిలు సీతారాంనాయక్, పసునూరి దయాకర్ తెలిపారు.