రాష్ట్రీయం

వాటా కోసం పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 29: కృష్ణా జలాల పంపిణీలో రాష్ట్రానికి హక్కుపరంగా రావాల్సిన వాటాను ఎన్ని అవరోధాలు ఎదురైనా సాధిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు. భూగర్భజలాల పెంపుదల, నీరు-ప్రగతి, పంట- సంజీవని, జలవనరుల సంరక్షణకు సంబంధించిన అంశాలపై శుక్రవారం సీఎం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. తొలుత గుంటూరులో ఐటీసీ ఫైవ్‌స్టార్ హోటల్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం గురజాల నియోజకవర్గంలోని బ్రాహ్మణపల్లి, నడికుడిలో పంట సంజీవని కార్యక్రమాలకు హాజరయ్యారు. సాయంత్రం గుంటూరు నగరంలోని సన్నిధి కల్యాణ మండపంలో జలవనరులు, వ్యవసాయశాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నీరు- ప్రగతి అవగాహన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. కృష్ణాజలాల పంపిణీలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎగువ రాష్ట్రాల్లో అక్రమ ప్రాజెక్టుల కారణంగానే మన రాష్ట్రానికి ముప్పు ముంచుకొస్తోందని హెచ్చరించారు. అయితే ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపించి అవసరమైతే ఉద్యమించటం ద్వారా హక్కులను సాధిస్తామన్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఇంకుడు గుంతలు.. పంట సంజీవని.. చెరువుల నిర్వహణ ద్వారా జలపరిరక్షణ ఓ మహోద్యమంగా చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంట ఇంకుడు గుంతతోపాటు ప్రతి రెండెకరాలకు పంట సంజీవని ఏర్పాటు చేసుకోవాలన్నారు. నెలరోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే వచ్చే వర్షాకాలంలో నీటిని నిల్వ చేసుకునే వీలు కలుగుతుందన్నారు. వర్షాకాలానికి ముందు మైనస్ 8 మీటర్లు.. తరువాత మైనస్ మూడు మీటర్లకు చేరుకుంటే తద్వారా సత్ఫలితాలను సాధించాలనేది ప్రభుత్వ ప్రణాళిక లక్ష్యంగా చెప్పారు. దీనివల్ల 750 టీఎంసిల జలవనరుల లభ్యత ఉంటుందని 75 లక్షల ఎకరాలకు సాగునీరందించే అవకాశాలు ఉన్నాయన్నారు. కరవురహిత రాష్ట్రానికి నిర్దిష్టమైన మార్గదర్శకాలు రూపొందించామని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో రిమోట్ కంట్రోల్ ద్వారా విద్యుత్ పంపిణీ.. సరఫరా నిర్వహించేందుకు అవసరమైన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. అనంతరం సభకు హాజరైన మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతుల చేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జలవనరుల సంక్షరణపై ప్రతిజ్ఞ చేయించారు.

చిత్రం నడికుడిలో పంట సంజీవని కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సిఎం చంద్రబాబు