రాష్ట్రీయం

కాళేశ్వరం ప్రాజెక్టుకు 2న శంకుస్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 29: నీటిపారుదల ప్రాజెక్టుల రీ-డిజైనింగ్ తర్వాత తొలిసారి చేపట్టబోతున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మే 2న శంకుస్థాపన చేయనున్నారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన హైడ్రో, ఎలక్ట్రికల్ పనులకు 7,998 కోట్ల నిధులకు పాలనాపరమైన అనుమతులు లభించాయి.
ప్రాణహిత- చేవెళ్లగా పేరొందిన ప్రాజెక్టుకు రీ-డిజైనింగ్ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుగా నామకరణం చేసిన విషయం తెలిసిందే. గతంలో ఈ ప్రాజెక్టు మహారాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరంతో ముందుకు సాగలేదు. అలాగే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు వల్ల మహారాష్టల్రో చాలా గ్రామాలు ముంపునకు గురి అవుతున్న క్రమంలో ఈ ప్రాజెక్టును ఆ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రాజెక్టు ఆగిపోవడానికి గల కారణాలపై టిఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని కోణాలనుంచి లోతుగా అధ్యయనం చేయడంతోపాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి అభ్యంతరం లేనివిధంగా దీనికి రీ-డిజైనింగ్ చేసే బాధ్యతను వ్యాప్కోస్‌కు అప్పగించింది. తమ్మిడిహట్టి వద్ద కాకుండా మేడిగడ్డ వద్ద బ్యారేజి నిర్మించడం ద్వారా మహారాష్టల్రో ముంపు సమస్యను అధిగమించవచ్చని వ్యాప్కో స్ నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను అనుసరించి కాళేశ్వరం ప్రాజెక్టుకు రీడిజైనింగ్ చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్తర, దక్షిణ తెలంగాణకు చెందిన జిల్లాలను ఏవిధంగా సస్యశ్యామలం చేయవచ్చో శాసనసభలో పవర్ పా యింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు క్షుణ్ణంగా వివరించిన సంగతి తెలిసిందే.
ఈ ప్రాజెక్టుకున్న అవాంతరాలన్నీ తొలగిపోవడంతో కాళేశ్వరం ప్రాజెక్టుకు మే 2వ తేదీన ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయబోతున్నారు.
ఎలక్ట్రో, హైడ్రో మెకానికల్ పనులకు నిధులు
కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగం అయిన ఎలక్ట్రో, హైడ్రో మెకానికల్ పనులకు రూ. 7,998 కోట్లకు పరిపాలనపరమైన అనుమతులను ఇస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మేడిగడ్డ నుంచి అన్నారం వరకు రూ.3,524 కోట్లు, అన్నారం నుంచి సుందిళ్ల వరకు రూ. 2140 కోట్లు, సుందిళ్ల నుంచి శ్రీపాద ఎల్లంపల్లి వరకు రూ. 2,334 కోట్ల పనులకు మొత్తంగా రూ. 7,998 కోట్లు మంజూరయ్యాయి. ఎత్తిపోతల, పంపుహౌజ్, హెడ్ రెగ్యులేటర్ నిర్మా ణం పనులకు మంజూరైన నిధుల నుంచి చేపట్టనున్నారు.