జాతీయ వార్తలు

ప్రత్యేక హోదా అడిగే హక్కు కాంగ్రెస్‌కు లేదు: సిఎం రమేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: కాంగ్రెస్ వల్లే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనమైపోయిందని టిడిపి ఎంపీ సిఎం రమేష్ ఆరోపించారు. విభజన పేరుతో ఏపిని నాశనం చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు పునర్మిస్తున్నారని ఆయన అన్నారు. శుక్రవారం రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు కెవిపి రామచందర్‌రావుప్రతిపాదించిన ప్రైవేట్‌మెంబర్ బిల్లుపై జరిగిన చర్చలో పావల్గొంటూ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌కు మాట్లాడే హక్కు లేదని ఆయన చెప్పారు. విభజన బిల్లు లోపభూయిష్టమని తమ పార్టీ ఎప్పటి నుండో వాదిస్తోందని ఆయన అన్నారు. యుపిఏ సంకీర్ణ ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో మేలు చేసిందంటూ జెడి శీలం చేసిన వాదనను రమేష్ తోసిపుచ్చారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ తదితర హామీలన్నీ పునాదులు లేని హామీలని ఆయన అభిప్రాయపడ్డారు. విభజన చట్టంలో వాటి గురించి స్పష్టమైన హామీ ఇవ్వకుండా అధ్యయనం, సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని మాత్రమే సూచించిందని రమేష్ ఎద్దేవా చేశారు. చట్టంలో స్పష్టమైన హామీ ఇవ్వకుండా అది చేయాలి, ఇది చేయాలని సూచిస్తే సరిపోతుందా? అని ఆయన శీలంను ప్రశ్నించారు. ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో ఎందుకు చేర్చలేనని రమేష్ నిలదీశారు. విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలకు నిర్దిష్టమైన రూపం కల్పించలేదు కాబట్టే అవి ఈ నాటికి అమలు కావటం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజధాని నిర్మాణం విషయంలోనూ స్పష్టమైన హామీ ఇవ్వలేదని ఎంపీ దుయ్యబట్టారు. చంద్రబాబు రాష్ట్భ్రావృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని, ప్రధాని మోదీ, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీని అనేక సార్లు కలిశారని ఆయన గుర్తుచేశారు.