రాష్ట్రీయం

ఇక గృహ ప్రవేశం అంత ఈజీ కాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, డిసెంబర్ 9: సొంతింటి కల సాకారం కాగానే మంచి ముహూర్తం నిర్ణయించుకుని బంధుగణం సమక్షంలో గృహప్రవేశం చేస్తుంటారు. అయితే ఇకపై అలా కుదరదంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మీరు ఇంటి నిర్మాణం పూర్తిచేసుకున్నా గృహప్రవేశానికి తమ అనుమతి తప్పక తీసుకోవాలని అంటున్నారు. కొత్తింట్లో చేరడానికి ముందే ఆయా నగర పాలక, పురపాలక సంస్థ అధికారుల అనుమతి తీసుకోవాలి. లేదంటే భారీ జరిమానా తప్పదు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పురపాలక, నగర పాలక సంస్థల కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. కొత్త ఇంట్లో చేరే ముందు ఆక్యుపెన్సీ సర్ట్ఫికెట్ తీసుకోవాలన్న ఉత్తర్వులు 2012లో జీఓ ఎంఎస్ నెం.168 ద్వారా జారీ అయ్యాయి. అప్పటి నుంచి ఈ నిబంధన అమలులో ఉన్నా క్షేత్రస్థాయిలో మాత్రం జరిమానాలు విధించిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. కొత్త ఇంటి నిర్మాణం పూర్తయిన వెంటనే ఆ ఇంటి యజమానులు అధికారులకు సమాచారం ఇవ్వాలని పేర్కొంటున్నారు.
ఈ మేరకు సంబంధిత సిబ్బంది కొత్త ఇంటి వద్దకు వెళ్లి నిబంధనల ప్రకారం నిర్మించారా లేదా అన్నది పరిశీలించి ఆక్యుపెన్సీ సర్ట్ఫికెట్ ఇవ్వాలో వద్దో అభిప్రాయం చెబుతూ ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తారు. దాన్ని పరిశీలించి కమిషనర్లు ఆక్యుపెన్సీ సర్ట్ఫికెటు జారీ చేస్తారు. ఆ తరువాత ఇంటి యజమాని గృహ ప్రవేశం చేసేందుకు వీలు లభిస్తుంది. ఆక్యుపెన్సీ సర్ట్ఫికెటు లేకుండా చేరితే జరిమానా విధిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
అనధికార నిర్మాణాలు, ఆక్యుపెన్సీ సర్ట్ఫికెట్ నిరాకరణ కేసులకు సంబంధించిన జరిమానా 2013లో సవరించిన చట్టం 15 ప్రకారం విధిస్తామని స్పష్టం చేస్తున్నారు. ఈ ఆదేశాలు తక్షణం అమలులోకి వస్తాయని కమిషనర్లు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించిందని అధికారులంటున్నారు. ఈ ఆదేశాల అమలు బాధ్యత ప్రాంతీయ పురపాలక సంచాలకులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఆక్యుపెన్సీ సర్ట్ఫికెట్లు సకాలంలో జారీ అవుతున్నాయా, జాప్యం చేస్తున్నారా అనే విషయాలతోపాటు తిరస్కరణకు గురైన దరఖాస్తులను కూడా పరిశీలించి నిబంధనలు పాటించారా లేదా అన్న అంశం పర్యవేక్షిస్తారని పేర్కొంటున్నారు. కొత్త ఇళ్లు నిర్మించుకున్న వారు ఈ నిబంధనతో ఆందోళన పడాల్సిన అవసరం లేదని అధికారులు అభయమిస్తున్నారు. అయితే అనధికార, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించుకున్న వారికి మాత్రం ఈ ఆదేశాలు ఆందోళన కలిగిస్తాయని వెల్లడిస్తున్నారు.

అమరావతి మెట్రోకు రూ. 50 లక్షలు
నిధులు మంజూరు చేస్తూ జీవో

హైదరాబాద్, డిసెంబర్ 9: విజయవాడలో ఏర్పాటు చేయతలపెట్టిన మెట్రో రైలు మార్గం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షల రూపాయల నిధులను విడుదల చేసింది. అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ కార్పొరేషన్‌కు పనులు ప్రారంభించేందుకు రూ. 5 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపగా, రాష్ట్రప్రభుత్వం తొలి విడతగా రూ. 50 లక్షల నిధులు మంజూరు చేసింది. ఈమేరకు బుధవారం జీవో 773ను జారీ చేసింది. ఈ నిధుల విడుదల బాధ్యతను మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ సహాయ కార్యదర్శికి అప్పగించారు.